Print
Hits: 78

ఉత్తర, మధ్య భారతంలో వచ్చిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. నాలుగు రాష్ర్టాల్లో వచ్చిన అకాల వర్షం తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. నాలుగు రాష్ర్టాల్లో

కురిసిన వర్షానికి పంటలు ధ్వంసమయ్యాయి. రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బారిన పడి 21 మంది మృతి చెందగా..మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ర్టలలో మరో 29 మంది మృత్యువాతపడ్డారు. రాజ్ కోట్, బనస్కాంత జిల్లాల్లో వడగండ్ల వానలు కురిశాయి. గుజరాత్ లో అకాల వర్షాలపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేసినట్లు పీఎంఓ ట్వీట్ చేసింది. దీనిపై మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ గుజరాత్ కు మాత్రమే పీఎం కాదని, దేశం మొత్తానికి ఆయన పీఎం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మృతులకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు పీఎంఓ వెల్లడించింది. 

e-max.it: your social media marketing partner