Print
Hits: 138

లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలుకు ముహుర్తం ఖరారయ్యింది. ఈ నెల 26వ తేదీన మోడీ నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్లు

బీజేపీ ప్రకటించింది. ఆయన వరుసగా రెండోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. పోయిన సరి ఎన్నికల్లో వారణాసిలో భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. మళ్లీ అదే జోష్ పునరావృఉటం అవుతుందని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.

అయితే అంతకుముందు ఈనెల 25వ తేదీన యూపీలోని బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి దశ్‌అశ్వమేథ్ ఘాట్ వరకు రోడ్‌షోలో మోడీ పాల్గొననున్నారు. అనంతరం కాల భైరవ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత పార్టీ కార్యకర్తలతో మోడీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. మరుసటి రోజు 26న కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తరువాత రోడ్ షో ద్వారా వచ్చి వారణాసిలో మోడీ నామినేషన్ దాఖలు చేస్తారు. అని బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది.

e-max.it: your social media marketing partner