ఢిల్లీ: కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్రత్యేకహోదా, విభజన హామీ వాగ్ధానాల అమలుపై... కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 11న అనగా రేపు సీఎం చంద్రబాబు ఢిల్లీలో
దీక్ష చేయబోతున్నారు. ఆ దీక్షలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ దీక్ష డిల్లీలోని ఏపీ భవన్లో జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. ఇదే దీక్షలో పాల్లొనేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఢిల్లీకి తరలివచ్చారు.
ఈ దీక్షలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై సీఎం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. కాగా దీక్షకు ముందు ఉదయం 7గంటలకు రాజ్‌ఘాట్‌లో చంద్రబాబు నివాళులర్పించనున్నారు. అనంతరం ఏపీ భవన్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేస్తారు.