చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం దాదాపుగా 70 శాతం దాకా పోలింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు.
రామనగర్ జిల్లాలో అత్యధికంగా 84 శాతం పోలింగ్ నమోదుకాగా, బెంగళూరు నగరంలో అత్యల్పంగా 44 శాతం నమోదైంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా దాదాపు హంగ్ వచ్చే అవకాశముందని చెబుతన్నాయి.