దేశంలోనే అత్యంత కీలకమైన అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీమసీదు కేసు తుది విచారణ సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన 'రామరాజ్య రథయాత్ర' నేడు అయోధ్యలో ప్రారంభం కానుంది.
ప్రత్యేకంగా నిర్మించిన రామరథం, వచ్చే రెండునెలల వ్యవధిలో ఆరు రాష్ట్రాల్లో పర్యటిస్తూ, తమిళనాడులోని రామేశ్వరంలో యాత్రను ముగించనుంది. నేటి రథయాత్ర 1990లో వీహెచ్పీ అయోధ్యలో ఏర్పాటు చేసుకున్న వర్క్ షాప్ కరసేవకపురం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం టాటా మినీ ట్రక్కును అందంగా అలంకరించారు. మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంక్షేమ సంస్థతో పాటు వీహెచ్పీ, వీహెచ్పీ అనుబంధ ముస్లిం రాష్ట్రీయ మంచ్ లు యాత్రను నిర్వహించనున్నాయి. కాగా, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ యాత్రతో మరోసారి మత కలహాలు మొదలవుతాయన్న ఆందోళనతో ఉన్నాయి.