దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి పీఠంపై తెలుగుబిడ్డ వెంకయ్యనాయుడు ఆశీనులయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో ఆయన భారత 13వ ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, వెంకయ్యతో ప్రమాణం చేయించారు.

వెంకయ్యనాయుడు అను నేను.. రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత ప్రదర్శిస్తానని ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేస్తున్నా అంటూ హిందీలో ప్రమాణం చేశారు. 10 నిమిషాలపాటు సాగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, విపక్షాలకు చెందిన కీలకనేతలు, రాష్ట్రాల సీఎంలు, పలు దేశాల రాయబారులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్‌ఘాట్‌కు వెళ్లిన వెంకయ్య జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. సర్దార్‌ వల్లభాయి పటేల్‌, దీన్‌దయాళ్‌ ఉపాథ్యాయులకు కూడా వెంకయ్య పుష్పాంజలి ఘటించారు. బీజేపీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వెంకయ్యనాయుడు ఇంతటి అత్యున్నత పదవిని చేరుకునేందుకు చాలా శ్రమించారనే చెప్పొచ్చు. వినమ్రత, నిరాడంబరతే ఆయన్ను రాజకీయ ఉద్ధండిగా నిలబెట్టింది. మొత్తంగా వెంకయ్య నాలుగుపదుల రాజకీయ జీవితం ఎన్నో ఆటుపోట్ల సమాహారం. కష్టాలకు ఏమాత్రం వెరవని మనస్తత్వం. నమ్మిన సిద్ధాంతాలకు నిబద్ధుడై ఉండే స్వభావం. ఎంత ఎదిగినా మూలాలను మరవని నైజమే ఆయన్ను ప్రజానేతగా నిలబెట్టాయి. పదవులు వెతుక్కుంటూ వచ్చాయేగాని ఎన్నడూ వాటికోసం పేచీలకు దిగని వ్యక్తిత్వం ఆయన సొంతం. అందుకే వెంకయ్యనాయుడు అంటే పార్టీ అధిష్టానానికి ప్రత్యేక అభిమానం. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన క్రమంలో ఆయన రాజకీయ కెరీర్ సుదీర్ఘమైంది. విద్యార్థి దశ నుంచే వెంకయ్యనాయుడు ప్రజాజీవితం ప్రారంభమైంది. నెల్లూరు వీఆర్‌ కళాశాల, విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థిసంఘం నేతగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి ముందున్న జనసంఘ్‌ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

దక్షిణాదిన ప్రజాక్షేత్రంలో భాజపాకి బలం లేకున్నా ఎన్నడూ నిరాశ చెందలేదు. ఎమర్జెన్సీ సమయంలో ఏబీవీపీ కార్యకర్తగా ఉన్న వెంకయ్యనాయుడిని అప్పటి ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో నిర్బంధించింది. విద్యార్థి దశ నుంచే ఆయన ప్రసంగాలు ఎంతో ఆకట్టుకునేవి. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా ఉపన్యసించగల దిట్ట. పార్టీ అగ్రనేతలు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే ఆడ్వాణీ తదితరుల గోడపత్రికలను స్వయంగా తానే అతికించిన వెంకయ్యనాయుడు అదే పార్టీకి రెండుసార్లు 2002-2004లో జాతీయ అధ్యక్షుడయ్యారు. కుటుంబపరంగా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా కేవలం క్రమశిక్షణ, ప్రతిభతోనే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన వెంకయ్యనాయుడు బీజేపీనే కన్నతల్లిగా భావించారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థిగా ఎంపికయ్యాక పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో కన్నతల్లిని వీడాల్సి వస్తుందంటూ ఉద్వేగభరితమవడం పార్టీతో ఆయనకు ఉన్న అనుబంధానికి తార్కాణం. 40ఏళ్ల పొలిటికల్ కెరీర్ లో వెంకయ్య పలు కీలక పదవులు అధిష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు వెంకయ్యనాయుడు రెండుసార్లు ఎన్నికయ్యారు. రాజ్యసభకు కర్ణాటక నుంచి మూడుమార్లు, రాజస్థాన్‌ నుంచి ఒకసారి ఎంపికయ్యారు. వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడిన ఎన్‌డీఏ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. నరేంద్రమోదీ సర్కార్ లో పార్లమెంటరీ వ్యవహారాలు; సమాచార, ప్రసార శాఖ, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల మంత్రిగా ఉన్నారు. కొత్త పథకాలను ప్రవేశపెట్టేలా చొరవ తీసుకున్నారు. అధికారపక్షంలో ఉన్నా విపక్ష సభ్యులను సైతం వివిధ అంశాలపై ఒప్పించి పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించటంలో వెంకయ్య దిట్ట. ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో స్థిరాస్తి, జీఎస్‌టీ వంటి పలు కీలకమైన బిల్లులకు సభామోదం పొందేలా చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన తెలుగువారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి తర్వాత మూడో తెలుగు వ్యక్తిగా వెంకయ్యనాయుడు. క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగిన వెంకయ్య రాజ్యసభ సభాపతిగా ఆ పదవిని వన్నెతెస్తారని అంతా ఆశిస్తున్నారు.

 

 

e-max.it: your social media marketing partner

సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు

మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని మండలంలోని సర్పంచులు బహిష్కరి...

కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జిహెచ్ఏంసి ముట్టడికి ప్రయత్నం చేశారు. వారిని ఎమ్మెల్యే క్వార్...

మునిగిన పోలవరం డయాఫ్రం వాల్

గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెస్ట్ గోదావరి జిల్లా పోలవరం డ్యామ్ వద్ద గోదావరి పరవళ్ళు త...

టీటీడీకి చంద్రబాబు ఆదేశాలు

తిరుమలలో మహాసంప్రోక్షణపై టీటీడీ పాలక మండలి తీసుకున్న శ్రీవారి దర్శనం నిలిపివేత నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆద...

పాల‌మూరు జిల్లాలో డ‌బ‌ల్ బెడ్రూం ఇండ్లపై స‌మీక్ష

బుధవారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అనితా రామ‌చంద్రన్ ప‌ర్యటి...

శాకంబరీ నవరాత్రి వేడుకలు

వరంగల్ మహా నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి వేడుకలు నాల్గువ రోజు...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

కురియన్ కు గౌరవ వీడ్కోలు

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జే.కురియన్ పదవీకాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు నివాసంలో ఆదివ...

మహబూబాబాద్ జిల్లాలో ఉక్కు బంద్

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ అఖిల పక్షాలు మహబూబాబాద్ జిల్లాలో బుధవారం బందుకు పిలుపునిచ్చాయి. బంద్...

స్కూల్ వ్యాన్ లో మంటలు

నిర్మల్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్, స్థానికులు చిన్నా...

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

హైదరాబాద్‌: తెలుగు సీనియర్‌ సినీ నటుడు వినోద్‌ (59) కన్నుమూశారు. బ్రెయిన్‌స్ర్టోక్‌తో శనివారం తెల్లవారుజామున 2...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్

భారతదేశంలో వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్ ను ప్రవేశపేట్టిందని బీఎస్ఎన్ఎల్ పీజీఎమ్ నరేందర్ తెలిపారు. వింగ్స్ య...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...