యువతరంతో చెన్నై మెరీనా తీరం హోరెత్తింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన యువతతో పాటు రైతులు, జల్లికట్టు మద్దతుదారులతో తీరం కిక్కిరిసిపోయింది. పొంగల్‌ నాటికి తమిళుల సంప్రదాయ, ధీరత్వ జల్లికట్టు క్రీడను నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ముక్తకంఠంతో నినదించారు.

ర్యాలీలో పాల్గొనాలంటూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహించారు. చెన్నై నగరం నుంచి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి యువకులే ఎక్కువ సంఖ్యలో రావడం గమనార్హం. కొందరు రైతులు తమ కోడెలను అలంకరించుకుని మరీ ర్యాలీకి వచ్చారు. చిన్నారులు పలువురు ధోవతీలు కట్టుకుని వచ్చి ఆకట్టుకున్నారు. జల్లికట్టుకు మద్దతుగా పలువురు ప్లకార్డులు ప్రదర్శించారు.

Jallikattu
Jallikattu

ఈ ఏడాది తప్పనిసరిగా అనుమతి అంటూ ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చిన వాగ్దానాలు బుట్టదాఖలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకాల్ని ప్రదర్శిస్తూ, ఈ ఏడాది కూడా జల్లికట్టును దూరం చేసే ప్రయత్నాల్లో పడడం తమిళనాట ఆగ్రహాన్ని రేపింది. జల్లికట్టు ప్రేమికులు పోరుబాట సాగిస్తూ వస్తున్నారు. ప్రతి పక్షాలన్నీ గళాన్ని వినిపిస్తూ వస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ ఓ వైపు సాగుతుంటే, మరో వైపు తాము సైతం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడికి యువలోకం ముందుకు దూసుకు రావడం విశేషం.

తమిళుల సంప్రదాయ, సాహస క్రీడను రక్షించుకునేందుకు యువజనం నడుం బిగించింది. ఫేస్‌బుక్‌లో ఏకమైన వేలాది మంది చెన్నై వైపుగా కదం తొక్కారు. మెరీనా తీరంలో శాంతియుత ర్యాలీతో జల్లికట్టు కోసం పట్టుబట్టారు. తమిళుల వీరత్వాన్ని చాటే సాహసక్రీడగా జల్లికట్టు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. జల్లికట్టు సందడి లేనిదే సంక్రాంతి పర్వదినం లేదని చెప్పవచ్చు. అయితే, ఈ క్రీడను రాక్షస క్రీడగా జంతు ప్రేమికులు అభివర్ణించడం చిక్కుల్ని తెచ్చిపెట్టింది. ఈ క్రీడకు సుప్రీంకోర్టు నిషేదం విధించడంతో జల్లికట్టు లేని సంక్రాంతిని గత ఏడాది జరుపుకోవాల్సి వచ్చింది.

జల్లికట్టు సాధనే లక్ష్యంగా విద్యార్థిలోకం, యువత, ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు ఏకమయ్యారు. జల్లికట్టు సాధన నినాదంతో కేర్‌ పేరిట ఓ ఫేస్‌బుక్‌ను ఏర్పాటు చేసి, భారీ నిరసనకు విద్యార్థి, యువలోకం కార్యచరణ సిద్ధం చేసింది. ఇందుకు స్పందించిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. రాజకీయాలకు అతీతంగా, ఏ సంస్థకు సంబంధం లేకుండా వేలాది మంది యువతీ యువకులు, విద్యార్థులు వేలాదిగా అన్నాసాలై మీదుగా మెరీనా వైపుగా ఉదయాన్నే కదిలారు. జల్లికట్టు తమ సంస్కృతి అన్న నినాదాలతో కూడిన  ప్లకార్డులను చేతబట్టి ముందుకు సాగారు. కొందరు అయితే, జల్లికట్టు తమ హక్కు అని, తమ సాహస క్రీడను దూరం చేయొద్దన్న నినాదాలతో టీ షర్టుల్ని ధరించి తరలి వచ్చారు. మరి కొందరు యువత టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లతో, పంచెకట్టుతో జల్లికట్టు ఎద్దును అలంకరించి అక్కడి తీసుకొచ్చారు. డప్పులు వాయిస్తూ ముందుకు దూసుకెళ్లారు. లైట్‌ హౌస్‌ నుంచి మన్రో విగ్రహం వరకు ర్యాలీగా ముందుకు సాగారు. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తూ, జల్లికట్టుకు అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. సంస్కృతి, సంప్రదాయాలు, మనోభావాలతో చెలగాటాలు వద్దు అని, దయ చేసి సంక్రాంతి పర్వదినం రోజున జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విన్నవించారు. తమకూ, రాజకీయాలకు సంబంధం లేదని, కేవలం జల్లికట్టు సాధనే తమ లక్ష్యం అని గళాన్ని వినిపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యల్ని వేగవంతం చేయాలని, జల్లికట్టుకు అనుమతి దక్కేలా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో విద్యార్థి, యువలోకం ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఏడాది తమకు అనుమతి దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆకాంక్షించారు. ఫేస్‌బుక్‌ రూపంలో ఏకమైన ఈ యువ సమూహం ఒక్కసారిగా మెరీనా తీరం వైపుగా దూసుకు రావడంతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. ఆగమేఘాలపై పోలీసుల యంత్రాంగం  భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చింది.

అసలు జల్లికట్టు అంటే?:

Jallikattu
Jallikattu

జల్లికట్టు ఇదో రాక్షస క్రీడ. రక్తం కారుతున్నా ఆగని రాక్షస క్రీడ. ప్రాణాలుపోతున్నా ఆస్వాదించే వీరత్వ క్రీడ. తమిళనాడు రాష్ట్ర్రంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిందిన 'జల్లికట్టు' మనిషికి, పశువులకు మధ్య సాగే రసపట్టులాంటి క్రీడ. ఇది బుల్ ఫైట్ తరహా క్రీడగానే గుర్తింపు. జల్లికట్టుకు మారుపేరు 'మైలారు పండగ'. పశువులను అదిమి పట్టుకోవడంలోనే సత్తా చూపాల్సిందే. పశువులకు మందు పట్టించి మరీ పరిగెత్తించడం, ఆపై అదిమి పట్టుకోవడం. పశువులను పట్టుకునే క్రమంలో ప్రాణాలతో చెలగాటం అదే జల్లికట్టు.

జల్లికట్టు తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట. ఇది స్పెయిన్ లో జరిగే ఆటకు దగ్గరగా ఉన్నా దీని విధానం వేరుగా ఉంటుంది. జల్లికట్టులో ఎద్దులను చంపరు. మచ్చిక చేసుకోవాలనుకొనేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. తమిళనాడులోని గ్రామాలలో సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ నాడు దీనిని జరుపుతారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే పోటీలు ప్రముఖమైనవి. దీన్నే 'మంజు విరాట్టు' అని పిలుస్తారు. 'మంజు విరాట్టు' అనగా 'ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం' అని అర్థం.

అసలు కొన్ని తమిళ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో విజేతలైన వారిని తమ భర్తలుగా ఎంచుకునే వారట. నీలగిరి జిల్లాకు చెందిన కరిక్కియూర్ అనే గ్రామంలో సుమారు 3500 సంవత్సరాల వయసు గల శిలా ఫలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. ఇంకా మధురైకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్ళుత్తు మెట్టుపట్టి అనే ప్రాంతంలో లభ్యమైన ఒక రాతి ఫలకం మీద కూడా ఒక మనిషి ఎద్దును నియంత్రిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది. దీని వయసు కూడా సుమారు 1500 సంవత్సరాలు ఉండవచ్చునని శాస్త్రవేత్తల అంచనా.

e-max.it: your social media marketing partner

త్వరలో టీడీపీలో చేరనున్న నటి వాణీ విశ్వనాథ్

ప్రముఖ సినీనటి వాణీ విశ్వనాథ్ త్వరలో తెలుగుదేశంలో చేరి రాజకీయ అరంగేట్రం చేస్తానన్నారు. అనంతపురంలో జరిగిన సమావే...

జగన్ పాదయాత్రలో గొడవ

జగన్ పాదయాత్రలో గొడవ జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ తో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సె...

కర్నూల్ జిల్లాలో విషాదం... గుండెపోటుతో రిటైర్డ్ ఎస్సై మృతి

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటుచేసుకుంది. కూరగాయలను కొనుక్కొనేందుకు కూరగాయల మార్కెట్ కు వచ్చిన రిటైర్డ...

కర్నూల్ జిల్లాలో శాసన మండలి ఛైర్మన్ మీడియా సమావేశం

శాసన మండలి ఛైర్మన్ గా నియమితులైన ఫరూక్ కర్నూల్ జిల్లా నంద్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు మండలి చైర్మన...

జగిత్యాల జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నాగుపాము కలకలం

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో నాగుపాము కలకలం సృష్టించింది.

నోటి దురుసుతనంతో చిక్కులో పడ్డ శాసన సభ్యుడు

ఖమ్మంజిల్లా వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ తన నోటి దురుసుతనంతో చిక్కులో పడ్డారు. సెల్ పోన్ లో తన సామాజిక వర్గాన్న...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించిన లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు

ఐక్య స్పెయిన్ కోరుతూ లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్ లోని అత్యంత ధనిక...

రాహుల్ ని 'పప్పు' అనడాన్ని నిషేదించిన గుజరాత్ ఎన్నికల కమిషన్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు' అని సంబోధించడాన్ని గుజరాత్ ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఆ...

బాహుబలి స్టంట్ చేయబోయి గాయాలపాలైన యువకుడు

బాహుబలిలో ప్రభాస్ చేసిన స్టంట్ ను రియల్ గా చేయాలని భావించిన యువకుడు చావు అంచుల దాకా వెళ్లాడు. ఏనుగుకు అరటిపండు...

ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్ల అరెస్ట్

టాస్క్ ఫోర్స్ కళ్ళు గప్పి అక్రమ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడిన ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అ...

క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసే ఇంటర్నేషనల్ ముఠా అరెస్ట్

ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసి డబ్బులు దండుకుంటున్న ఇంటర్నేషనల్ ముఠా గుట్టురట్టు అయింది.

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన జనసేన అధినేత పవన్‎కల్యాణ్ లండన్ పర...

నంది అవార్డులపై వ్యక్తమవుతున్న అసంతృప్తి

నంది అవార్డులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓ వర్గం వారికి అవార్డులను ఎక్కువగా ప్రకటించారనే విమర్శలు వెల్లువెత్త...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...