ఒక దురుదృష్టకరమైనవార్త ఇది. దేశం కోసం ప్రాణాలిచ్చే అమరవీరులకు మన ప్రభుత్వాలు ఇచ్చే గౌరవంపై సందేహాలు కలిగించే సందర్భం. మొన్న సుకుమాలో జరిగిన మావోయిస్టుల దాడిలో మరణించిన ఓ అమరవీరుడి కుటుంబానికి ఇచ్చిన చెక్కు బౌన్సయింది. ఈ ఘటనలో మరణించిన కానిస్టేబుల్ రంజిత్ కుమార్ కుటుంబం తమకు బీహార్ ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షల చెక్కును డిపాజిట్ చేసింది. తమ అకౌంట్లో డబ్బు జమకాలేదని మూడు నాలుగుసార్లు బ్యాంకు చుట్టూ తిరిగితే చెక్కు బౌన్సయిందని అధికారులు చెప్పారు. రంజిత్ కుమార్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెక్కు బౌన్స్ ఘటన అమరవీరులను అవమానించడమే అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుకుమా అమరవీరులకు నివాళులు కూడా అర్పించలేదని బీహార్ సీఎం నితీశ్ పై ఇప్పటికే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఈ చెక్కు బౌన్స్ ఆయన్ని మరింత ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం మరోసారి దెబ్బతింది. ఇటీవల కాలంలో ఆమె తరచూ అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఆ మధ్యన యూపీతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలో తన ఎన్నికల ప్రచారం షురూ చేసిన రోజునే తీవ్ర అస్వస్థతకు గురి కావటం అప్పటికప్పుడు ఆమెను ఢిల్లీకి తరలించటం తెలిసిందే. ఆ తర్వాత అస్వస్థత కొనసాగుతుండటంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనలేదు. 

అనంతరం ఆమె కోలుకున్నప్పటికీ ఈ మధ్యనే ఆమె మరోసారి అనారోగ్యానికి గురైనట్లుగా చెబుతారు. రెగ్యులర్ చెకప్ కోసం అమెరికాకు వెళ్లినట్లు చెప్పినప్పటికీ అనారోగ్యం కారణంగానే అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకొని వచ్చినట్లుగా చెబుతున్నారు. అమెరికాలో జరిగిన చికిత్స సందర్భంగా రాహుల్, ప్రియాంకా తదితరులు అమెరికాకు వెళ్లి ఆమె వెంటే కొంతకాలం ఉండి వచ్చారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురి కావటం గమనార్హం. ఆదివారం ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ తో అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమెను గంగారాం ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

గురువారం వరకూ ఆమె ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. గడిచిన రెండు దఫాలుగా సోనియా అనారోగ్యానికి గురైన ప్రతిసారీ గంగారాం ఆసుపత్రిలోనే చికిత్స చేస్తున్నారు.  ఇదిలా ఉండగా సోనియా లాంటి వీవీఐపీ తీసుకునే ఆహారం ఫుడ్ పాయిజనింగ్ కావటం ఏమిటి ఎక్కడ తప్పటడుగులు పడుతున్నాయి. ఇటీవల కాలంలో సోనియమ్మ తరచూ అనారోగ్యానికి కారణం ఏమిటి అన్న వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. కోట్లాదిమంది అభిమానించే సోనియా ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలిపితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగరగొట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు అల్టిమేటం ఇచ్చింది. కోర్టు ధిక్కార అభియోగాల్లో విజయ్‌మాల్యాను దోషిగా తేల్చిన అత్యున్నత ధర్మాసనం దీనికి సంబంధించిన తీర్పును జులై 10వ తేదీన వెల్లడించనున్నట్టు తెలిపింది. దీంతో తీర్పును ప్రకటించే జూలై 10వ తేదీలోగా న్యాయస్థానం ఎదుట హాజరయ్యేందుకు మాల్యాకు అవకాశం ఇస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పై విచారణ చేపట్టాలని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ అవినీతి నిరోధక శాఖను ఆదేశించారు. ఢిల్లీ ఆరోగ్య శాఖామంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రెండు కోట్ల రూపాయలు లంచంగా తీసుకోవడాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్టు ఆప్ మాజీనేత కపిల్ మిశ్రా ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ పై ఎల్జీ విచారణకు ఆదేశించింది.

ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అధినేత్రి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరిగే ఈ...

ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, రాష్ట్రపతి,...

కలుషిత నీరు తాగి 30మంది అస్వస్థత

కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా సిద్ధేశ్వరం కాలనీలో కలుషిత నీరు తాగడం వల్ల 30మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వ...

మహానాడులో చేయనున్న 12 తీర్మానాలు

గత మూడురోజుల మహానాడులో 12 తీర్మానాలు చేయనున్నారు. సంక్షేమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రక్షళన, అభివృద్ధి కేంద్ర...

తెలంగాణ పోలీసుల పనీ తీరును అభినందించిన మంత్రులు

తెలంగాణ పోలీసుల పనీ తీరును పలువురు మంత్రులు అభినందించారు. వరంగల్ అర్బన్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమాండ్ కం...

కోదాడలో అగ్ని ప్రమాదం..

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కరెంట్ స్థంభం విరిగి గడ్డివాములపై పడటంతో సుమారు 50 ఎకర...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

బెంగళూరులో రసాయన వ్యర్థాల వల్ల ప్రమాద స్థాయికి చేరుకున్న నురగ

బెంగళూరులో రసాయన వ్యర్థాల వల్ల ప్రమాద స్థాయికి చేరుకున్న నురగ

కర్ణాటక రాజధాని బెంగళూరుకు నురగ బెంగ పట్టుకుంది. నగరంలోని బెల్లందూర్‌ సరస్సులో భారీ ఎత్తులో కలుస్తున్న రసాయన వ...

మోడీ పథకాలపై షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

మూడేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దూరదర్శన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను కేంద్ర సమాచ...

యాదాద్రి జిల్లాలో పరువు హత్య

యాదాద్రి జిల్లాలో పరువుకోసం హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కులం కాని వ్యక్తి తన కూతుర్ని పె...

హైదరాబాద్ లో దొంగ బాబా అరెస్ట్

అమాయకుల బలహీనతనలను ఆసరాగా చేసుకుని మంత్రాలతో కష్టాలు తీరుస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఒక దొంగబాబాన...

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

మరో సీనియర్‌ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దంపతులు బెన్‌ స్టిల్లర్‌-క్రిస్టిన్‌ టేలర్‌ తమ 1...

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో 2లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంద...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...