జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌ను నిఘా వలయంలోకి తీసుకురావాలని నీలగిరి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రత్యేక చెక్‌ పోస్టులు ఆ మార్గాల్లో ఏర్పాటు చేయనుంది. అలాగే ఎస్టేట్ మొత్తాన్ని సీసీ కెమెరాల నిఘాతో పర్యవేక్షించాలని అధికారులు డిసైడయ్యారు.

జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌ తేయాకు తోటల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. దాదాపు 16 వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్ లో ఓ పాత బంగ్లా, మరో కొత్త బంగ్లా, సమీపంలో హెలిప్యాడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. 55 వేల చదరపు అడుగులతో నిర్మితమైన కొత్త బంగ్లా అంటే జయలలితకు ఎంతో ఇష్టం. జయలలిత బతికున్న సమయంలో దాదాపు 80 నిఘా కెమెరాలతో కొడనాడు ఎస్టేట్ భద్రత పర్యవేక్షించారు. ఈ కొడనాడు ఎస్టేట్ లోనే జయ ఆస్థులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, భారీగా నగదు, వజ్రాలు, బంగారం ఉన్నట్లు చాలా మందికి అనుమాలు ఉన్నాయి.

అయితే జయలలిత చనిపోయిన తర్వాత కొడనాడు ఎస్టేట్ దగ్గర పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం భద్రత తొలగించడంతో ప్రైవేట్ సైన్యం రంగంలోకి దిగింది. మొదట్లో ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ హత్య జరిగింది. అంతేకాదు దోపిడీకి ప్రయత్నించిన ముఠాలో ఒకడు చనిపోవడం, మరో ఇద్దరు తీవ్ర ప్రమాదాల బారిన పడటం జరిగి పోయాయి. దీంతో కొడనాడులో ఏదో ఉందన్న సంగతి బయట ప్రపంచానికి తెల్సొచ్చింది. అంతేకాదు గుర్తు తెలియని వ్యక్తులు ఎస్టేట్ మొత్తాన్ని డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తున్న అంశం కూడా పోలీసులను అలెర్ట్ చేసింది. వరుస ఘటనలు, ఆరోపణలు, రోజుకు వెయ్యి కిలోల తేయాకు మాయం అవుతుందన్న ప్రచారంతో కొడనాడులో భద్రత రెట్టింపు చేస్తున్నారు నీలగిరి జిల్లా అధికారులు. కొడనాడు రోడ్డులో భారీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 20 చోట్ల నిఘా కెమెరాల్ని అమర్చి భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. ఎస్టేట్ మార్గంలో వెళ్లే వాహనాలు, వ్యక్తుల వివరాల్ని నమోదు చేసుకుంటున్నారు.

గవర్నమెంట్ ఆఫీసులు, కార్పొరేట్ కంపెనీల మాదిరిగానే ఇక మీదట పెట్రోల్ బంకులు కూడా టైమ్ టూ టైమ్ ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు మాత్రమే పనిచేయనున్నాయి. ఇతర ఆఫీసుల్లాగే ఆదివారాలు పెట్రోల్ బంకులూ సెలవు తీసుకుంటాయి. అయితే ఇదంతా తమ కమీషన్ పెంచాలంటూ పెట్రోలు బంకుల యజమానులు చేస్తున్న నిరసనలో భాగం. కాగా ఈ వ్యవహారం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదర్కోవలసి వస్తుందో అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుడు ఆడిట్ నివేదిక సమర్పించిందని ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది. దీంతో మరోమారు కేజ్రీవాల్ కు చుక్కలు కనపిస్తున్నాయి. ఇప్పటికే సీబీఐ, ఏసీబీ, ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ ను కలిసి కేజ్రీవాల్ అవినీతిపై సాక్షాలు సమర్పించిన మాజీ ఆప్ నేత కపిల్ మిశ్రా ఆరోపణలతో అడ్డంగా బుక్ అయిన కేజ్రీవాల్ కు ప్రతిరోజూ ఏదోఒక కొత్త షాక్ తగులుతోంది. ఇప్పుడు తాజాగా ఐటీశాఖ ప్రకటనతో కేజ్రీవాల్ అష్ఠదిగ్భంధనంలో చిక్కుకుపోయారు. 

 

 

  

 

 

 

వివాహ వేడుకలో విషాదం అలముకున్న దుర్ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లాలో జరిగింది. భారీ వర్షంతో పాటు ఉధృతంగా గాలులు వీచడంతో పెళ్లిమండపం గోడ కూలిన దుర్ఘటనలో 24 మంది మరణించగా, మరో 26మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అధినేత్రి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరిగే ఈ...

ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, రాష్ట్రపతి,...

కలుషిత నీరు తాగి 30మంది అస్వస్థత

కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా సిద్ధేశ్వరం కాలనీలో కలుషిత నీరు తాగడం వల్ల 30మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వ...

మహానాడులో చేయనున్న 12 తీర్మానాలు

గత మూడురోజుల మహానాడులో 12 తీర్మానాలు చేయనున్నారు. సంక్షేమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రక్షళన, అభివృద్ధి కేంద్ర...

తెలంగాణ పోలీసుల పనీ తీరును అభినందించిన మంత్రులు

తెలంగాణ పోలీసుల పనీ తీరును పలువురు మంత్రులు అభినందించారు. వరంగల్ అర్బన్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమాండ్ కం...

కోదాడలో అగ్ని ప్రమాదం..

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కరెంట్ స్థంభం విరిగి గడ్డివాములపై పడటంతో సుమారు 50 ఎకర...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

బెంగళూరులో రసాయన వ్యర్థాల వల్ల ప్రమాద స్థాయికి చేరుకున్న నురగ

బెంగళూరులో రసాయన వ్యర్థాల వల్ల ప్రమాద స్థాయికి చేరుకున్న నురగ

కర్ణాటక రాజధాని బెంగళూరుకు నురగ బెంగ పట్టుకుంది. నగరంలోని బెల్లందూర్‌ సరస్సులో భారీ ఎత్తులో కలుస్తున్న రసాయన వ...

మోడీ పథకాలపై షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

మూడేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దూరదర్శన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను కేంద్ర సమాచ...

యాదాద్రి జిల్లాలో పరువు హత్య

యాదాద్రి జిల్లాలో పరువుకోసం హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కులం కాని వ్యక్తి తన కూతుర్ని పె...

హైదరాబాద్ లో దొంగ బాబా అరెస్ట్

అమాయకుల బలహీనతనలను ఆసరాగా చేసుకుని మంత్రాలతో కష్టాలు తీరుస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఒక దొంగబాబాన...

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

మరో సీనియర్‌ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దంపతులు బెన్‌ స్టిల్లర్‌-క్రిస్టిన్‌ టేలర్‌ తమ 1...

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో 2లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంద...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...