నిఫా వైరస్ మనదేశంలో ఇది వెలుగు లోకి రావడం కొత్తకాదు. కానీ వేగంగా, సమర్ధంగా చర్యలు తీసుకోకపోతే ఈ అంటువ్యాధి కోరలు చాచి పెద్దసంఖ్యలో ప్రాణనష్టాన్ని కలిగిస్తుంది. అందుకే అటు కేరళ ప్రభుత్వం, ఇటు కేంద్రం తక్షణం స్పందించాయి. తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రజలకు ధైర్యం కల్పిస్తున్నాయి.

మన దేశాన్ని అనుకుని ఉన్న బంగ్లాదేశ్... భారత్ లో వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది. గతంలో పశ్చిమ బెంగాల్‌లో రెండుసార్లు నిఫా వైరస్‌ వ్యాప్తి చెందింది. భారీ ప్రాణనష్టాన్ని కలిగించింది. 2001లో సిలిగురిలో నిఫా వైరస్‌ లక్షణాలతో 67 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకసారి ఈ వైరస్ సోకితే సాధారణంగా ప్రాణాలతో బయటపడడం అత్యంత అరుదైన విషయం. సిలిగురిలో వైరస్ సోకిన 67 మందిలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే 74 శాతం మేర అన్నమాట. మిగతా 26 శాతం మంది కూడా చాలా కాలం వరకు కోలుకోలేకపోయారు. 

2004లోనూ మరోసారి నిఫా భయపెట్టింది. నాడు కూడా పశ్చిమ బెంగాల్ తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో నిఫా ఉనికి చాటుకుంది. ఆ దఫా బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లాను వణికించింది. 77 మంది వ్యాధి బారిన పడ్డారు. వారిలో అసలు గుర్తించే సరికే 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిని నిఫా వైరస్ సోకిందని గుర్తించి చికిత్స మొదలుపెట్టినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. వైరస్ ను నియంత్రించే ఏర్పాట్లు లేకపోవడం, సరైన చికిత్సలు, మందలు అందుబాటులోకి రాకపోవడంతో రోగుల పాలిట శాపంగా మారింది. అందుకే 2004లో మొత్తం 61 మంది నిఫా బారిన పడ్డారు. మిగతా వారు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు. ఆ తర్వాత మన దగ్గర పెద్దగా కనిపించని నిఫా మల్లీ 14 ఏళ్ల తర్వాత వెలుగు చూసింది. కేరళలో కోరలు చాచింది.

నిఫా వైరస్ వల్ల మనుషుల్లో తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ సమస్యలు రోగులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తాయి. పళ్లను తినే గబ్బిలాలు, ఇతర జంతువుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారి ద్వారా కూడా విస్తరిస్తుంది. కేరళ నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు ఎక్కువే. విమానాలు, రైళ్ల ద్వారా రోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. వ్యాధి వ్యాప్తికి అనేక కారకాలు ఉండడంతో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు వణికిపోవాల్సి వస్తోంది. 

ఈ విషయం గ్రహించిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిఫా కట్టడికి కార్యాచరణ ప్రారంభించాయి. ఈలోపే సదరు వైరస్ హైదరాబాద్ కు వ్యాపించింది. హైదరాబాద్ లో ఇద్దరికి ఈ వైరస్ సోకిందని వైద్యులు ధృవీకరించారు కూడా. కేరళకు వెళ్లి వచ్చిన ఓ హైదరాబాదీకి, మరో వ్యక్తికి నిఫా వైరస్ సోకినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు. వీరి రక్త నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టు తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికార వర్గాలు వెల్లడించాయి. 

నిఫా వైరస్ మలబార్ తీరాన్ని వణికిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ కూడా అప్రమత్తమైంది. విశాల తీరప్రాంతం ఉండడంతో వ్యాధి వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భయపడుతున్నారు. కేరళ నుంచి నిత్యం ఇతర ప్రాంతాలకు ప్రయాణికుల రాకపోకలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కేరళ నుంచి విశాఖకు నిత్యం విమాన, రైళ్ల ద్వారా అనేకమంది వచ్చి వెళ్తుంటారు. అందుకని నిఫా విస్తరిస్తే ఏర్పడే పరిణామాలను ఎదుర్కునేందుకు ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.

మరోవైపు ఈ డెడ్లీ వైరస్‌ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. జాతీయ వ్యాధి నియంత్రణ బృందాన్ని కేరళకు పంపించింది. అక్కడి స్థితిగతులను తెలుసుకుంటోంది. నివారణ పద్ధతులను, చర్యలను సూచించాలని ఆదేశించింది. కేరళలో నిఫా వైరస్ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్షిస్తోంది.

జమ్మూ కాశ్మీర్: సాంబా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఒక చిన్నారి మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి, 48 గంటలనుంచి జరుగుతున్న కాల్పుల్లో మొత్తంగా 11మంది చనిపోయారు. భారత జవాన్లు పాక్ కాల్పులను తిప్పికొడుతున్నారు. ప్రస్తుతం సాంబా సెక్టార్లో భయానక వాతావరణం నెలకొంది.

toottukudi tension in tamilnadu

తూత్తుకుడి ఆందోళనకారుల మృతులకు తమిళ నాడు ప్రభుత్వం రూ.10లక్షలు,

train accident at gwalior

ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు భోగీలు

కడపకు ఉక్కు రాదు తుక్కు రాదు - టీడీపీ నేత

కడప: సీఎం రమేష్ ఉక్కు దీక్షపై వైసీపీ ఎమ్మల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజులనుంచి దీక్ష చేస్తున...

తెరాసలో వర్గ పోరు

జనగామ జిల్లాలో టీఆర్ఎస్ నేతల వర్గపోరు బయటపడింది. చిలుపూర్ మండల కేంద్రంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ నేతల మధ్య...

ఈతకెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు

కృష్ణ: ఇబ్రహీంపట్నం ఫెరీ ఘాట్ విషాదానికి వేదికైంది. కృష్ణ నదిలో ఈతకానీ వెళ్లిన నలుగురు యువకులు అందులో గల్లంతయ్...

చంద్రబాబుకు ఘన స్వాగతం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విశాఖలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన విశాఖలోని మధురవాడలో అమృత వ్యాలీ...

నాడు తెలంగాణకు, నేడు తెలంగాణ అభివృద్ధికి ఆయనే అవరోధం

సిద్దిపేట: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భాగంగ...

బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ నిరసన

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీస...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

తెలంగాణ‌కు ఉత్తమ‌ పాస్ పోర్ట్ సేవ‌ల‌ అవార్డ్

దేశ వ్యాప్తంగా చేస్తున్న పాస్ పోర్ట్ సేవ‌ల‌కు గాను సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి, అలాగే తెలంగాణ‌ రాష్ట్ర...

55 వేల మందితో మోదీ చేసిన పని

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం దేశమంతటా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లోని డెహ్ర...

9 మందిని కబళించిన రోడ్డు ప్రమాదం

కర్నూల్: ఓర్వకల్లు (మం) సోమయాజులు పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తోన్న ఆర్టీసీ బస్సు, ఆటోను...

రైల్వేగేటును ఢీ కొన్న టిప్పర్

శ్రీకాకుళం: వేగంగా వస్తోన్న టిప్పర్ కోటబొమ్మాళి-నౌపాడ మధ్య కాకరపల్లి రైల్వేగేటును ఢీ కొంది. ఈ ఘటనలో రైల్వే గేట...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...