ఢిల్లీ హైకోర్టు సాక్షిగా కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, సీనియర్‌ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, ఆప్‌ నాయ కులు రాఘవ్‌ చద్దా, కుమార్‌ విశ్వాస్, అశుతోష్‌ సంజయ్‌ సింగ్, దీపక్‌ బాజ్‌పాయ్‌ లకు వ్యతిరేకంగా జైట్లీ ఢిల్లీ హైకోర్టులో 10 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లో జరిగిన ఆర్థిక అవకతవకలకు 2000 నుంచి 2013 వరకు దాని అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీయే బాధ్యుడని ఆప్‌ నాయకులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో జైట్లీ ఈ దావా వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది జెఠ్మ లానీ, జైట్లీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

హరియాణా మాజీ సీఎం ఎట్టకేలకు 12వ తరగతి పాసయ్యారు. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత ఓం ప్రకాశ్‌ చౌతాలా 82 ఏళ్ల వయస్సులో 12వ తరగతి పాస్ కావడం విశేషం. తన హయాంలో జరిగిన ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఆయన పాత్ర నిరూపితం కావడంతో ప్రస్తుతం తీహార్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఏప్రిల్‌లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ నిర్వహించిన 12వ తరగతి పరీక్షలకు చౌతాలా హాజరుకావడం అందులో ఫస్ట్ క్లాస్ సాధించడం విశేషం. గత వారం విడుదలైన ఫలితాల్లో తన తండ్రికి ఏ గ్రేడ్‌ వచ్చినట్లు చౌతాలా కుమారుడు అభయ్‌ చౌతాలా తెలిపారు.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఏపి, తెలంగాణ రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులు సమావేశమయ్యారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనలపై సమావేశంలో చర్చించారు. ఈమధ్యే ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనల ఫైలును కేంద్ర న్యాయశాఖ ఆమోదించిన సంగతి తెలిసిందే. హోంమంత్రిత్వశాఖ ఆమోదంపై వెంకయ్యనాయుడుతో ఇరువురు మంత్రులు చర్చించారు. 

ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన దిల్లీ మంత్రి కపిల్‌ మిశ్రా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్‌ ఏడాదిలో రెండుసార్లు మాత్రమే సీఎం కార్యాలయానికి వస్తారంటూ ట్విటర్‌ ద్వారా కామెంట్స్‌ చేశారు. తమ అవినీతి బాగోతం బయటపడటంతో ఆప్‌ నేతలు భయపడుతున్నారని వారికి కేజ్రీవాల్‌ ధైర్యం చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ అవినీతి ఆరోపణలు ప్రజలు మరో 15 రోజుల్లో మర్చిపోతారు. వారికి భయపడకండి అని కేజ్రీవాల్‌ ఆప్‌ నేతలకు చెబుతున్నారు.

ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అధినేత్రి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరిగే ఈ...

ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, రాష్ట్రపతి,...

కలుషిత నీరు తాగి 30మంది అస్వస్థత

కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా సిద్ధేశ్వరం కాలనీలో కలుషిత నీరు తాగడం వల్ల 30మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వ...

మహానాడులో చేయనున్న 12 తీర్మానాలు

గత మూడురోజుల మహానాడులో 12 తీర్మానాలు చేయనున్నారు. సంక్షేమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రక్షళన, అభివృద్ధి కేంద్ర...

తెలంగాణ పోలీసుల పనీ తీరును అభినందించిన మంత్రులు

తెలంగాణ పోలీసుల పనీ తీరును పలువురు మంత్రులు అభినందించారు. వరంగల్ అర్బన్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమాండ్ కం...

కోదాడలో అగ్ని ప్రమాదం..

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కరెంట్ స్థంభం విరిగి గడ్డివాములపై పడటంతో సుమారు 50 ఎకర...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

బెంగళూరులో రసాయన వ్యర్థాల వల్ల ప్రమాద స్థాయికి చేరుకున్న నురగ

బెంగళూరులో రసాయన వ్యర్థాల వల్ల ప్రమాద స్థాయికి చేరుకున్న నురగ

కర్ణాటక రాజధాని బెంగళూరుకు నురగ బెంగ పట్టుకుంది. నగరంలోని బెల్లందూర్‌ సరస్సులో భారీ ఎత్తులో కలుస్తున్న రసాయన వ...

మోడీ పథకాలపై షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

మూడేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దూరదర్శన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను కేంద్ర సమాచ...

యాదాద్రి జిల్లాలో పరువు హత్య

యాదాద్రి జిల్లాలో పరువుకోసం హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కులం కాని వ్యక్తి తన కూతుర్ని పె...

హైదరాబాద్ లో దొంగ బాబా అరెస్ట్

అమాయకుల బలహీనతనలను ఆసరాగా చేసుకుని మంత్రాలతో కష్టాలు తీరుస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఒక దొంగబాబాన...

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

మరో సీనియర్‌ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దంపతులు బెన్‌ స్టిల్లర్‌-క్రిస్టిన్‌ టేలర్‌ తమ 1...

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో 2లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంద...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...