జమ్మూకాశ్మీర్ లోని యూరి సెక్టార్ ను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సందర్శించారు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీ నుంచి వైమానిక హెలికాప్టర్ లో నేరుగా యూరి సెక్టార్ కు చేరుకున్నారు.

యూరీ: సరిహద్దుల్లో ఉగ్రవాదులు చనిపోయిన వారి సంఖ్య 20 కు చేరింది. ఎవ్వరూ ఊహించని సైనిక శిబిరంలోని నిరాయుధులపై దాడి చేశారు. డీజిల్‌ డంప్‌కు నిప్పుపెట్టారు, మూడు నిమిషాల్లోనే ఏకంగా 17 గ్రనేడ్లు విసిరారు. దాంతో డీజిల్‌ డంప్‌ ఒక్కసారిగా పేలిపోయింది. 150 మీటర్ల వ్యాసార్థంలోని టెంట్లు, బ్యారక్‌లు మంటల్లో చిక్కుకున్నాయి. నిన్న 17 మంది సైనికులు అగ్నికి ఆహూతి కాగా ఇవాళ మరో ముగ్గురు చనిపోయారు.

మూడు నిమిషాల్లోనే 17 గ్రనేడ్లను విసిరారు:

తెల్లవారుజామున 5.15 గంటలవుతోంది యూరీలోని ఆర్మీ అడ్మినిసే్ట్రటివ్‌ యూనిట్‌లోని సైనికులు చమురు ట్యాంకుల నుంచి డీజిల్‌ను బ్యారళ్లలోకి నింపుతున్నారు. వారంతా నిరాయుధులే ఆ సమయంలోనే నలుగురు ఉగ్రవాదులు దాడి చేశారు. ఊహించని విధంగా, అకస్మాత్తుగా మూడు నిమిషాల్లోనే 17 గ్రనేడ్లను విసిరారు. వాటి ధాటికి డీజిల్‌ డంప్‌ ఒక్కసారిగా పేలిపోయింది. బారళ్లలోకి డీజిల్‌ నింపుతున్న 13 మంది సైనికులు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. డీజిల్‌ డంపు చుట్టూ సైనికులు పడుకోవ డానికి టెంట్లు, తాత్కాలిక బ్యారక్‌లు ఉన్నాయి. 150 మీటర్ల వ్యాసార్థంలో మంటలు ఎగసిపడ్డాయి. టెంట్లు, బ్యారక్‌లు తగలబడిపోయాయి, టెంట్లలో నిద్రిస్తున్న మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన నలుగురు ఆస్పత్రిలో మరణించారు.

ఉగ్రవాదుల నుంచి మ్యాప్‌ స్వాధీనం:

మట్టుబెట్టిన ఉగ్రవాదుల నుంచి ఆర్మీ ఓ మ్యాప్‌ను స్వాధీనం చేసుకుంది. అందులో ఉగ్రవాద దాడికి సంబంధించిన పూర్తి వివరాలున్నాయి. ఎలా వెళ్లాలి ఎక్కడ దాడి చేయాలి? దారిలో ఎక్కడెక్కడ ఏమేం ఉన్నాయి? తదితర వివరాలన్నీ ఆ మ్యాప్‌లో పస్థూన్‌ భాషలో సవివరంగా ఉన్నాయి. పాకిస్థాన్‌లో మాట్లాడే గిరిజన భాషల్లో పస్థూన్‌ ఒకటన్న విషయం తెలిసిందే. అలాగే, యూరీలోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు పూర్తిస్థాయిలో రెక్కీ నిర్వహించి ఉంటారని లేదా ఆ శిబిరానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏమేం జరుగుతాయనే పూర్తి వివరాలు తెలిసి ఉంటాయని భావిస్తున్నారు.

భారీ వ్యూహంతోనే:

సైనికులు షిఫ్టులు మారే సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. అలాగే, ఆ మ్యాప్‌లోని వివరాల ప్రకారం ఆత్మాహుతి దళాలు భారీ వ్యూహంతోనే యూరీకి చేరుకున్నాయి. తొలుత నిరాయుధులైన సైనికులపై దాడి చేయాలి. తర్వాత బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌ సమీపంలోని మెడికల్‌ ఎయిడ్‌ యూనిట్‌పై దాడి చేయాలి. తర్వాత ఆఫీసర్స్‌ మెస్‌లోకి చొరబడాలి అక్కడ తమకు తాము పేల్చేసుకోవాలి. అయితే, ఉగ్రవాదులు కూడా ఊహించని విధంగా తొలి లక్ష్యం దగ్గరే డీజిల్‌ డంప్‌ పేలిపోయింది. దాంతో ఆ ప్రాంతమంతా పెద్దఎత్తున మంటలు, పొగ! ఎదురుగా ఏమీ కనిపించడం లేదు. దాంతో ఉగ్రవాదులకు కూడా ఏమీ పాలుపోలేదు. ఉగ్రవాదులు కూడా చెల్లాచెదురయ్యారు. సమీపంలోని టెంట్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. అక్కడి నుంచే సైనికులపై కాల్పులు జరపడంతో సైనికులు ఎదురు దాడిచేశారు.

ఇస్లామాబాద్‌: జమ్ము-కశ్మీరులోని ఉడి వద్ద ఆదివారం జరిగిన తీవ్రవాద దాడి దుర్ఘటన వెనక తమ హస్తం ఉందన్న భారత్‌ ఆరోపణలను పాకిస్థాన్‌ తీవ్రంగా ఖండించింది. భారత్‌ ఆరోపణలు నిరాధారమైనవనీ...తొందర పాటు విమర్శలనీ స్పష్టం చేసింది. భారత్‌ తాను చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేసింది. తమపై ఆరోపణలు చేయడం కాదు ఆధారాలు చూపాలంటూ పాకిస్థానీ డీజీఎంవో భారత డీజీఎంఓకు స్పష్టం చేసినట్లు రేడియో పాకిస్థాన్‌ పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి రెండు వైపులా కట్టుదిట్టమైన భద్రత ఉందనీ చొరబాట్లనేవి అసలు జరగనేలేదనీ పాక్‌ సైనిక ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

 

వెన్నుపోటు.. నమ్మక ద్రోహం.. విశ్వాస ఘాతుకం.. పొరుగుదేశం పాక్‌ నయవంచక నైజాన్ని వర్ణించేందుకు ఇలాంటి పదాలు ఎన్నైనా వర్ణించడానికి సరిపోవంటే అతిశయోక్తి కాదు. నాడు అటల్‌ బిహారీ వాజపేయి హయాంలో ఆయన బస్సు దౌత్యం నెరపితే.. కార్గిల్‌లో ఆక్రమణలకు పాల్పడి వెన్నుపోటు పొడిచింది. కార్గిల్‌ యుద్ధంలో ఓటమితో భంగపాటు ఎదురైనా బుద్ధి తెచ్చుకోలేదు.

పార్టీకి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత

బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు ఫ్యాక్స్ ద్వారా...

వైసీపీ నేతపై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ

వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. నీతి వంతుడైన చంద్రబాబును బోన...

తాడేపల్లిగూడెం రైతు కళ్ళల్లో ఆనందం

తాడేపల్లిగూడెం. (మండలం) మెట్ట ప్రాంతం తాడిపల్లి. పెడతాడిపల్లి వేకటరామన్నగూడెం కడి య్యద్ద రైతు కళ్ళల్లో ఆనందం ఈ...

బీజేపీ పట్టిసీమ ఫై మాట్లాడటం విడ్డురం: ముళ్ళపూడి బాపిరాజు

రాష్ట్ర దేవాదాయా శాఖ మాజీమంత్రి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు పైడికొండల మాణిక్యాలరావు పై జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి...

క్షణికావేశంలో దంపతుల ఉరి వేసుకొన్నారు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విషాదం. దంపతుల అంతం చూసిన క్షణికావేశం. మనస్తాపంతో ఇవాళ ఉరివేసుకుని చనిపోయిన కానిస...

ఎగ్జామ్ హలో మాస్ కాపియింగ్, ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ టెన్త్ ఎగ్జామ్ సెంటర్ లో మాస్ కాపియింగ్ నిర్...

ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి హెచ్‌1-బీ వీసా దరఖాస్తులు స్వీకరణ

అమెరికాలో హెచ్‌1-బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి హెచ్‌1-బీ వీసా దరఖాస్తులు...

ఫేస్‌బుక్‌ను డిలీట్‌ చేయాల్సిన సమయం వచ్చిందా !

వాట్సప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రేన్‌ ఆక్టన్‌ ఫేస్‌బుక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జయ కేసులో మరో ట్విస్ట్!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత కేసులో మరో ట్విస్ట్. తీవ్ర అస్వస్థతతో చెన్నై అపోలో ఆసుపత్రిలో జయ చేరిన...

హతిన్‌ విశ్రాంతి కోసం పదవి నుంచి తప్పుకునాడు

మయన్మార్‌ అధ్యక్షుడు హతిన్‌ క్యా తన పదవికి రాజీనామా చేశారు. మయన్మార్‌కు చెందిన ప్రముఖ నాయకురాలు, హక్కుల నేత ఆం...

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం చేసిన అన్నదమ్ముల అరెస్ట్

విదేశాల్లో ఉద్యోగాల పేరిట అమాయకులను మోసం చేసిన కేసులో అన్నదమ్ములిద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

కూకట్ పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

కూకట్ పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మూసాపేటకు చెందిన సుధీర్ ఇంటర్ పరీక్షలకు హాజరవుతుండగా పట...

ప్రియ దడ్వాల్‌కు నటుడు రవి కిషన్‌ సాయం

ప్రియ దడ్వాల్‌కు నటుడు రవి కిషన్‌ సాయం

తీవ్ర అనారోగ్యంతో అత్యంత దీన స్థితిలో బతుకు పోరాటం చేస్తున్న అలనాటి బాలీవుడ్‌ నటి ప్రియ దడ్వాల్‌కు ప్రముఖ నటుడ...

హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీ!

హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీ!

ఆధ్యాత్మికత ద్వారా రాజకీయాల్లో మార్పు తెస్తానని ఇటీవల వ్యాఖ్యానించిన రజనీకాంత్ మరోసారి హిమాలయాలకు వెళ్లిపోయారు...

శ్రీలంక లో టీమిండియా భద్రతపై భారత్ లో ఆందోళన

శ్రీలంక లో పర్యటిస్తున్న భారత జట్టు క్షేమంగా ఉందని బిసిసిఐ ప్రకటించింది. బౌద్ధులకు, ముస్లింలకు మధ్య జరుగుతున్న...

రికార్డుల రారాజు మన కింగ్ కోహ్లీ

కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కింగ్ అనిపించుకున్నాడు. వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ 900 పాయింట్లు సాధించిన సరికొత్త...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...