Print
Hits: 235

తూ.గో: తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు మారేడుమిల్లి - చింతూరు మధ్యలోని వాల్మీకి కొండ వద్ద

అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తోన్న 8 మంది మృతి చెందగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

e-max.it: your social media marketing partner