Print
Hits: 228
police case on bandla ganesh

హైదరాబాద్: టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వైఎస్సార్‌ సీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)ను బండ్ల గణేష్‌ తన అనుచరులతో గతరాత్రి బెదిరింపులకు

పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గణేష్‌తో పాటు అతని అనుచరులపై పోలీసులు ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాలు చుస్తే... ఎన్టీఆర్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ‘టెంపర్’ సినిమాకు సంబంధించి సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పివిపి)...రూ.7 కోట్లు ఫైనాన్స్‌ చేశారు. గత కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే గణేష్‌కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పీవీపీ ఇంటికి వెళ్లి ఆయనపై బెదిరింపులకు పాల్పడడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

e-max.it: your social media marketing partner