Print
Hits: 191

తూర్పుగోదావరి: ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్‌ ఇంటి ముందు యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ రోజు ఉదయం ఓ యువతి మంత్రి ఇంటి

ముందు పురుగుల మందు తాగడంతో స్థానికంగా కలకలం రేగింది. కుటుంబ కలహాలతోనే ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే... తనకు న్యాయం చేయాలంటూ మంత్రికి విన్నవించుకున్నా పట్టించుకోలేదని దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన యువతి మంత్రి విశ్వరూప్‌ ఎదుటే పురుగుల మందుతాగినట్లు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, మంత్రి సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు.

e-max.it: your social media marketing partner