హైదరాబాద్: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్య కేసు దర్యాప్తు స్పీడందుకుంది. బంజారాహిల్స్ ఎసిపి నేతృత్వంలోని ఓ ప్రత్యేక బృందం ఈ కేసును లోతుగా

అధ్యయనం చేస్తోంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఎనిమిది కాల్ చేసిన కోడెల చివరగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ కి కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అన్న మిస్టరీని టెక్నికల్ సపోర్ట్ తోనే ఛేదిస్తామని పోలీసులు వెల్లడించారు. అసలు కోడెల కేసులో పోలీసులు తెలుసుకున్న వాస్తవాలేంటో ఓ లుక్కెద్దాం.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కేసు తెలంగాణ పోలీసులకు ఓ ఛాలెంజ్ గా మారింది. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును ఛేదించాలని బంజారాహిల్స్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇందుకోసం బంజారాహిల్స్ ఎసిపి శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం లోతుగా అధ్యయనం చేస్తోంది. కోడెల ఫోన్ కాల్స్ లిస్టు సేకరించిన పోలీసులు ఆయన ఉదయం ఎనిమిది కాల్స్ చేసినట్లు గుర్తించారు.

అందులో చివరకు 24 నిమిషాలపాటు మాట్లాడిన కాల్ పై ఆరా తీశారు. కాల్ డేటాని సేకరించిన పోలీసులు కోడెల తన ఫోన్ నుండి చివరి సారిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుమతితో మాట్లాడినట్లు గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవాలని ఉదయాన్నే కోడెల డిసైడ్ అయినట్లు దర్యాప్తులో తేలింది. అయితే డాక్టర్ తో ఏం మాట్లాడాడు అన్న విషయాలు తెలియాలంటే సుమతిని విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేసే మోచనలో పడ్డారు పోలీసులు.

20 రోజుల కిందటే హైదరాబాద్ కి వచ్చిన ఆయన తన పార్టీ నేతలతో కానీ, కార్యాకర్తలతో కానీ, చివరకు దగ్గరి బంధువులతో సైతం మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఇంట్లో మాత్రమే మౌనంగా ఉంటూ తన గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉండేవారని తెలిసింది. ఈ కేసులో కోడెల శివరాంకి ఎలాంటి సంబంధం లేదని బంజారాహిల్స్ పోలీసులు చెబుతుండగా, ఆయన భార్య, కూతురు, గన్ మెన్, డ్రైవర్ తో పాటు ఇంటికి కాపలా ఉన్న మరో నలుగురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో సహా ఎనిమిది మందిని ఐ విట్ నెస్ లుగా కేసులో పొందుపరిచారు.

ఈ కేసులో డాక్టర్ సుమతితో పాటు, మరికొంత మందిని విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. తనపై అధికారపార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న సమయంలో సహచర పార్టీ నేతలు ఎవరూ ఆరోపణలు ఖండించక పోవడం, తనకు మద్దతు తెలపకపోవడంపై కూడా కోడెల మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో అతని కూతురు విజయలక్ష్మీ ఏపీ ప్రభుత్వం పెట్టిన వేధింపులకు తట్టుకోలేకే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  పేర్కొంది.

e-max.it: your social media marketing partner

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

పురాణాల్లో విన్నాం... ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం... చంద్రబాబు

వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీకి ఓటేసిన వాళ్ళను బతకనివ్వడంలేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు...

శ్రీకాకుళంలో జిల్లాలో చంద్రబాబు పర్యటన ఖరారు...

శ్రీకాకుళం: శ్రీకాకుళంలో జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఖరారయ్యింది. పార్టీ నేతలతో కలిసి ఈనెల 21, 22...

రెండో రోజుకు కొల్లు రవీంద్ర దీక్ష...

కృష్ణా: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన ఇంటి దగ్గర దీక్ష చేస్తున్నారు. కృత్రిమ ఇసుక కొరతకు నిరసనగా ఆ...

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వందే బాధ్యత... రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత,...

అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన తప్పులే కేసీఆర్ చేస్తున్నాడు... లక్ష్మణ్

హైదరాబాద్‌: ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

రాజస్థాన్‌లో భూకంపం...

హైదరాబాద్‌: రాజస్థాన్‌లో ఈ రోజు ఉదయం సంభవించిన భూకంపం కలకలం సృష్టించింది. రాష్ట్రంలోని బికనీర్‌లో ఈ ఉదయం 10.36...

వెంకయ్య నాయుడుకి ఆఫ్రికా దేశంలో అరుదైన గౌరవం

కొమొరోస్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆఫ్రికా దేశంలో అరుదైన గౌరవం దక్కింది. కొమొరోస్ అత్యున్నత పౌరపురస్...

ఇళ్లలోకి చొరబడి... పట్టపగలే రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్‌

రంగారెడ్డి: జిల్లాలో పట్టపగలే చైన్‌ స్నాచర్స్‌ రెచ్చిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం గండిపేట మండలం కిస్మత్‌పూర్‌లో ఇళ...

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వదంతులు నమ్మొద్దు... ఎస్పీ

కడప: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు... జిల్లా ఎస్పీ అన్బురాజన్. ఎవర...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

ఫైనల్ లో ఓడిన మంజు రాణి...

రష్యా: ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ లో భారత్ మహిళా బాక్సర్ మంజు రాణి ఓడిపోయింది. సెమీ ఫైనల్లో ర...

సౌతాఫ్రికా 275 ఆలౌట్... భారీ ఆధిక్యంలో భారత్

పూణే: భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్నా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 275 పరుగులకే కుప్పకూల...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...

రూపాయి పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...