Print
Hits: 297

మెదక్‌: శివంపేట మండలం శంకర్‌తండాలో ఈ రోజు ఉదయం ఓ గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామంలోని ఓ

పూరింటిలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో గుడిసె పూర్తిగా దగ్ధమవగా, మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదస్థలికి చేరుకున్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

e-max.it: your social media marketing partner