Print
Hits: 110

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఆన్‌లైన్‌ ద్వారా గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఆ ముఠాలో నలుగురు సభ్యులను పోలీసులు

అరెస్టు చేయగా... మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ నిందితుల నుంచి రూ.30 లక్షల విలువైన 150 కిలోల గంజాయి... 2 కార్లు, 4 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

e-max.it: your social media marketing partner