హైదరాబాద్: అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. కేసుకు సంబందించిన రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు తెలిపింది. కేసు హైకోర్టులో
ఉన్నప్పుడే రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని సిట్ తెలిపింది. కాగా రికార్డుల ధ్వంసంపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. 4 వారాల్లో దానిపై నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్ జనరల్‌కు ఆదేశించిన కోర్టు. రాష్ట్ర పోలీసుల కన్నా సీబీఐ దర్యాప్తు మేలేమోనన్న హైకోర్టు... సీబీఐని సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది.