హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. కోటి పురుషోత్తం, కోటి వినోదిని అనే ఇద్దరు మావోయిస్టులు పోలీస్ కమిషనర్ అంజని కుమార్ ఎదుట
లొంగిపోయారు... లొంగిపోయిన వారిలో ఉన్న పురుషోత్తం మావోయిస్టులలో టాప్ క్యాడర్ లో ఉన్నాడు. అతనిపై రూ.8 లక్షల రివార్డు కూడా ఉంది. పురుషోత్తం 1974లోనే బీఏ, 1987ఎంఏ పాసయ్యారు. అతని తల్లిదండ్రుల మరణంతో నాటి పీపుల్స్ వారులో మావోలకు ఆకర్షితుడై మావోయిస్టులతో చేతులు కలిపాడు. వారు ఇద్దరు స్వయంగా కమిషనర్ ఆఫీసుకు వచ్చి లొంగిపోయినట్టు పోలీసు కమిషనర్ అంజని కుమార్ యాదవ్ తెలిపారు.
అనంతరం కోటి పురుషోత్తం మాట్లాడుతూ... తాము అనారోగ్యంతోనే లొంగిపోయాము అని తెలిపారు. 1975 నుంచి ఆస్తమాతో తీవ్ర అవస్థలు పడుతున్నా... గత రెండేళ్లుగా పార్టీలో మాకు స్థానం లేకుండా చేశారని ఆవేదన చెందాడు. సెంట్రల్ మావోయిస్టుల కమిటీ కూడా మా సమస్యను తీర్చలేకపోయింది. మావోయిస్టు నేత గణపతితో కలిసి చాలా సంవత్సరాలు పని చేశాము. ప్రస్తుతం మానవ సంబంధాలు మావోయిస్టుల పార్టీలో దూరమయ్యాయి. తెలంగాణ రావడం కూడా మా లొంగుబాటుకు ఓ కారణం అని తెలిపాడు. రామకృష్ణ ఒక అసమర్థుడు అన్న పురుషోత్తం... ఆయన ఎదుటి వాళ్లను ఎదగనివ్వడు అంటూ ఆవేదన చెందాడు. ఎమ్మెల్యేలను చంపడంపై స్పందించిన పురుషోత్తం... ఎమ్మెల్యేలను చంపడం అనేది చాలా తప్పు... దాన్ని నేను సమర్ధించాను అని వ్యాఖ్యానించాడు మావోయిస్టు కోటి పురుషోత్తం.