Print
Hits: 325

జమ్ముకశ్మీర్‌ లోయలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కిష్తావర్‌లోని థాక్రయ్‌ ప్రాంత్రంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాను అదుపుతప్పి అక్కడి లోయలో పడింది. ఈ ఘటనలో

వ్యానులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రయాణికులు మృతి చెందగా.. మరో 16 మంది తీవ్రంగా గాయపదినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. వ్యానులో నుంచి వెలికి తీసిన మృతదేహాలను, గాయపడ్డ క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

e-max.it: your social media marketing partner