Print
Hits: 332

విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు దారుణ సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో పని చేస్తున్న రాంబాబు అనే వ్యక్తి సీపీ

కార్యాలయం ముందు హల్ చల్ చేశాడు. తాగిన మైకంలో సీపీ ఆఫీస్ ముందు ఆత్మ హత్య చేసుకోబోయాడు. అతన్ని పట్టించుకోకుండా సీపీ కార్యాలయ సిబ్బంది చోద్యం చూశారు. అత్తా, భార్య వేధింపులనుంచి తనకు న్యాయం చేయాలంటూ రాంబాబు కమిషనర్ ను కోరాడు. తన సమస్యను పరిష్కరిస్తానని జాయింట్ పోలీస్ కమిషనర్ రాణా హామీ ఇచ్చారు. జాయింట్ సీపీ ఆదేశాలతో కార్యాలయ సిబ్బంది రాంబాబును సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

e-max.it: your social media marketing partner