బిట్రగుంట పాసింజర్ రైలులో ఓ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్లే ప్యాసింజర్ రైలు బోగిలో యువతి ఫ్యాన్ కు ఉరివేసుకుని వేలాడుతుండగా గమనించిన గార్డ్ పోలీసులకు సమాచారం అందించాడు.
కావలి రైల్వే స్టేషన్ లో పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఒంగోలులో ఆ యువతి భోగీలో ఒంటరిగా ఉండటం గమనించిన ఓ టీసీ, బోగీ తలుపులు వేసుకుని కూర్చోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. కానీ, ట్రైన్ కావలి చేరుకునేసరకి బోగీలో ఫ్యాన్ కు వేలాడుతూ యువతి కనిపించింది. ఆమె ఎవరు? ఒంగోలు నుంచి కావలి ట్రైన్ వెళ్లేలోపు ఏం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. యువతి బ్యాగ్ లో ఓ డెయిరీ ఉన్నా ఆ డెయిరీలో ఆమె పేరు ఉన్న పేజీ చింపివేశారు. దీంతో ఆమె ఎవరో గుర్తించడం పోలీసులకు సమస్యగా మారింది. ఇది ఆత్మహత్య లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.