ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి విత్తన మఫియా రెచ్చిపోతున్నది. అధికార యంత్రాంగం సాక్షిగా విత్తనపత్తి వ్యాపారం పేరుతో ప్రతిఏటా కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. విత్తన పత్తి వ్యాపారులు చెల్లిస్తున్న రాయల్టీకి వాస్తవ విక్రయాలకు పొంతన లేకుండా ఉంది. కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తున్న వారు వేలరూపాయల్లో రాయల్టి చెల్లిస్తూ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు అక్రమ పత్తివిత్తన దందా వ్యాపించింది. కొన్ని గ్రామాలు యూనిట్ గా ఏజెంట్లను ఏర్పాటుచేసి ఈ వ్యాపారాన్ని దర్జాగా సాగిస్తున్నారు. ఈ ఏజెంట్లు ముందుగానే ఆయా గ్రామాలలో పర్యటిస్తూ నకిలీ విత్తనాల పట్ల అమాయక రైతులు ఆకర్షితులయ్యేలా ప్రచారం జరుపుతారు. ఫలాన పత్తివిత్తనం సాగుచేసిన తాము లక్షలకు లక్షలు గడించినట్లు పత్తిరైతులకు ఆశ కల్పిస్తారు. దళారుల మాటలు నమ్మిన రైతులు తొలకరి జల్లుకురువగానే పత్తివిత్తన కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నాణ్యత విత్తనాలతో పాటు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునే రీతిలో కొన్ని పేరుమోసిన బ్రాండ్ల పేరుతో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. రాయల్టీ అగ్రిమెంటుకు విరుద్ధంగా విత్తన ప్యాకెట్లు తయారుచేసి అమ్ముతున్నారు. కొన్ని జిన్నింగ్ కంపనీలు నాన్ సీడ్ పత్తివిత్తనాలను సైతం యధేచ్ఛగా ప్యాక్ చేసి నాణ్యమైన సీడ్ విత్తనాలని రైతులకు అంటగడుతున్నారు. దాంతో నాసీరకం విత్తనాలు వాడిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దిగుబడి లేక చివరకు కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూత్పూరులో పెద్ద ఎత్తున జరుగుతున్న పత్తివిత్తన నకిలీ వ్యాపారాన్ని అధికారులు చిత్తశుద్దితో అరికట్టడం లేదన్న ఆరోపణలు ప్రతి ఖరీఫ్ లో వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయశాఖకు అన్నీ తెలిసికూడ ఏమి తెలియనట్లు నటిస్తోంది. అప్పుడప్పుడు విజిలెన్స్ తనిఖీలలో మాత్రమే అక్రమాల డొంక కదులుతున్నది. తాజాగా భూత్పూరు మండలంలో పలు పత్తివిత్తన వ్యాపార కేంద్రాలలో విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. కంటితుడుపుగా కొన్ని పత్తివిత్తన కేంద్రాను సీజ్ చేశారు. అయితే గతంలో సీజ్ చేసిన విత్తనాలు సైతం విక్రయమయ్యాయి. పత్తివిత్తన కంపెనీ యజమానుల ఆగడాలు మితిమీరాయి. భూత్పూరు మండల కేంద్రం పత్తివిత్తన వ్యాపారానికి ముఖ్యకేంద్రంగా మారింది. గతంలో ఐదు పత్తివిత్తన కేంద్రాలుండగా ఇటీవల ఈ సంఖ్య 25కు పెరిగింది. ఇంత పెద్దఎత్తున నకిలీ దందా జరుగుతుండగా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పత్తివిత్తన అక్రమ దందాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.

 

e-max.it: your social media marketing partner

బీజేపీ నాయకులతో ప్రధాని మోడీ, అమిత్‌ షాల భేటీ

బీజేపీ పాలిత రాష్ట్రాల సిఎంలు, డిప్యూటీ సిఎంలతో ప్రధాని మోడీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలు భేటీ అవుతున...

కాంగ్రెస్ పార్టీలోకి మారినందుకు టీఆర్ఎస్ నాయకుల బెదిరింపులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామా పరిధిలోని బాపురిపల్లి తండాలో ఇటివల టీఆర్ఎస్ నుం...

తిరుమలలో అక్రమంగా మద్యం, పోగాకు తరలిస్తున్న 11మంది అరెస్ట్

తిరుమలకు అక్రమంగా మద్యం, నిషేదిత పోగాకు పదార్ధాలను తరలిస్తున్న 11మందిని అదుపులోకి తీసుకున్నట్లు టీటీడీ ఛీఫ్ వి...

నెల్లూరులో సంచలనం సృష్టించిన క్రికెట్‌ బెట్టింగ్‌ కేసు కీలక మలుపు

నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్‌ బెట్టింగ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఈ...

మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వారి గుట్టురట్టు

మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ ల పరిధిలో...

సికింద్రాబాద్ లో ఘనంగా జరిగిన ఓనం పండుగ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మళయాళీలు ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఓనం పండుగ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల...

పాక్ లో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాకిస్తాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాఘా సరిహద్దుల్లో పాక్ సైనికులు భారత సైనికులకు మిఠ...

రక్షాభందన్‌ సందర్భంగా భారత్‌ నుంచి ట్రంప్‌కు చేరిన రాఖీలు

సోదర ప్రేమకు ప్రతీకగా నిలిచే రక్షాభందన్‌ను పురస్కరించుకుని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భ...

ప్రియాంకపై మీడియాలో వస్తున్న వార్తలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ

పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పగిస్తారంటూ మీడియాలో వస్తున్న వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పార్టీ బాధ్యత...

లోక్ సభ, అసెంబ్లీలకు దేశ వ్యాప్తంగా ఎన్నికలు

లోక్ సభ, అసెంబ్లీలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలన్నది ప్రధాని మోడీ ఆలోచన. దీనికి రాజ్యాంగపరంగా అనేక ఇ...

విశాఖలో దారుణం..గంజాయి లావాదేవీలలో యువకుడి హత్య

విశాఖజిల్లా నర్సీపట్నంలో ఓ యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి లావాదేవీలు...

ప్రకాశం జిల్లా కందుకూరులో మహిళ దారుణ హాత్య

ప్రకాశం జిల్లా కందుకూరులో మహిళ దారుణ హాత్యకు గురయ్యింది. మృతురాలు పొన్నలూరు మండలం యొల్లటూరు గ్రామానికి చెందిన...

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త. డానియల్ క్రెగ్ మళ్ళీ జేమ్స్ బాండ్ గా నటించేందుకు అంగీకరించాడు. వరుసగా అయిదు...

'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీ షూటింగ్ కి నో పర్మిషన్!

'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీ షూటింగ్ కి నో పర్మిషన్!

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'మిడిల్ క్లాస్ అబ్బాయి'. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు ప...

అభిమానిపై ఆప్యాయత చూపిన సచిన్ టెండూల్కర్

తనకోసం ఎదురుచూస్తున్న అభిమానిపై ఆప్యాయత చాటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన అభిమానిని భద్రతా సిబ్బంద...

2019 వరల్డ్ కప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో విఫలమైనప్పటికీ ఓవరాల్ గా ఇండియన్ టీం ప్రదర్శన బాగుందని భారత క్రికెట్ సెలక్షన్స్ కమి...

నిలకడగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు నిలకడగా ట్రేడవుతున్నాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు నిలకడగా ముగిశాయి. ఉదయం ను...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...