వరంగల్ పరకాలలో ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగిపోతోంది. రాజకీయ నేతలు, అధికారుల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అడ్డు అదుపు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ప్రజా ప్రతినిదుల మద్దతుతో పాటూ పోలీసులు, రెవెన్యు అధికారుల భరోసా ఉండడంతో ఈ దందాకు రెక్కలొచ్చాయి. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార గణం అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది.

పరకాల సబ్ డివిజన్ లోని చర్లపల్లి గ్రామ శివారులో ఉన్న గూడెం వాగు నుంచి అక్రమార్కులు ఇసుకను తవ్వేస్తున్నారు. ఇక్కడి నుంచే ప్రతీ రోజూ 20 లారీల ఇసుకను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు తరలిస్తున్నారు. అంటే ఈ ఇసుక దందా ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇటు రెవెన్యు అధికారులు కూడా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఈ దందాను అడ్డుకునేవారే కరవయ్యారు. 

పరకాల మండలం లో ఉన్న చలివాగు తీర ప్రాంతాల్లో కూడా ఇసుక అక్రమ రావాణా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. దీనిపై తీర ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేసినా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురిసినా వివిధ వాగులలో భారీగా ఇసుక దిబ్బలు వచ్చి చేరాయి. వీటిని గమనించిన అక్రమార్కులు ఇసుకను రాత్రికి రాత్రే పట్టణాలకు తరలిస్తున్నారు. దీంతో తీర ప్రాంతాలలో సాగుకు సిద్దం అవుతున్న రైతులకు పంట చేతికి వచ్చే సమయంలో భూగర్బ జలాలు అడుగుంటే దుస్థితి నెలకొంది. మొత్తంగా ఇసుక అక్రమ తవ్వకాలు రైతన్నలను ఇబ్బందుల్లోకి నెట్టాయి.

ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసినా అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. నేతలు, అధికార యంత్రాగం మద్దతు ఉండడంతో తమ అక్రమాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వీరులకు అండగా ఉన్న నాయకుల్లో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే ఉండడంతో పోలీసులు కూడా చేతలుడిగి చూస్తున్నారు. చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు.

ఇసుక దందాకు అధికార పార్టీ నేతల పరోక్ష మద్దతు ఉండడంతో ఎన్ని ఫిర్యాదులు వెల్లువెత్తినా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు అత్యల్పం. అంతేకాక కేసులను నీరు గార్చే యత్నాలు కూడా జోరుగా సాగిపోతున్నాయి. ఇటీవలే పరకాల నుండి వెళ్తున్న ఏడు ఇసుక ట్రాక్టర్ లను స్థానికులు కొందరు పోలీసులకు అప్పగించారు. అయితే వీటిలో రెండింటిని తప్పించి ఐదు ట్రాక్టర్లే పట్టుబడ్డాయని రికార్డుల్లో నమోదు చేశారు. మరోపక్క, తనిఖీల సమయంలో ఇసుక ట్రాక్టర్లు దొరికినా పోలీసులు వదిలేస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. పోలీసులు అక్రమార్కులకు కొమ్ముకాయడం మాని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

ఇసుక దందాపై రెవెన్యు అధికారుల వైఖరిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్ట ప్రకారం అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్లపల్లి నుంచే కాక భూపాలపల్లి, గిద్దె ముత్తారం, కాల్వపల్లిల నుంచి కూడా టన్నుల కొద్ది ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. గోదావరి తీర ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. మంగపేట, కాళేశ్వరం, శివారుల్లో ఎలాంటి పరిమిట్లు లేకుండానే ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ అక్రమాలకు తక్షణమే అడ్డుకట్టవేయాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

e-max.it: your social media marketing partner

త్వరలో టీడీపీలో చేరనున్న నటి వాణీ విశ్వనాథ్

ప్రముఖ సినీనటి వాణీ విశ్వనాథ్ త్వరలో తెలుగుదేశంలో చేరి రాజకీయ అరంగేట్రం చేస్తానన్నారు. అనంతపురంలో జరిగిన సమావే...

జగన్ పాదయాత్రలో గొడవ

జగన్ పాదయాత్రలో గొడవ జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ తో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సె...

కర్నూల్ జిల్లాలో విషాదం... గుండెపోటుతో రిటైర్డ్ ఎస్సై మృతి

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటుచేసుకుంది. కూరగాయలను కొనుక్కొనేందుకు కూరగాయల మార్కెట్ కు వచ్చిన రిటైర్డ...

కర్నూల్ జిల్లాలో శాసన మండలి ఛైర్మన్ మీడియా సమావేశం

శాసన మండలి ఛైర్మన్ గా నియమితులైన ఫరూక్ కర్నూల్ జిల్లా నంద్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు మండలి చైర్మన...

జగిత్యాల జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నాగుపాము కలకలం

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో నాగుపాము కలకలం సృష్టించింది.

నోటి దురుసుతనంతో చిక్కులో పడ్డ శాసన సభ్యుడు

ఖమ్మంజిల్లా వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ తన నోటి దురుసుతనంతో చిక్కులో పడ్డారు. సెల్ పోన్ లో తన సామాజిక వర్గాన్న...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించిన లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు

ఐక్య స్పెయిన్ కోరుతూ లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్ లోని అత్యంత ధనిక...

రాహుల్ ని 'పప్పు' అనడాన్ని నిషేదించిన గుజరాత్ ఎన్నికల కమిషన్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు' అని సంబోధించడాన్ని గుజరాత్ ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఆ...

బాహుబలి స్టంట్ చేయబోయి గాయాలపాలైన యువకుడు

బాహుబలిలో ప్రభాస్ చేసిన స్టంట్ ను రియల్ గా చేయాలని భావించిన యువకుడు చావు అంచుల దాకా వెళ్లాడు. ఏనుగుకు అరటిపండు...

ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్ల అరెస్ట్

టాస్క్ ఫోర్స్ కళ్ళు గప్పి అక్రమ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడిన ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అ...

క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసే ఇంటర్నేషనల్ ముఠా అరెస్ట్

ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసి డబ్బులు దండుకుంటున్న ఇంటర్నేషనల్ ముఠా గుట్టురట్టు అయింది.

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన జనసేన అధినేత పవన్‎కల్యాణ్ లండన్ పర...

నంది అవార్డులపై వ్యక్తమవుతున్న అసంతృప్తి

నంది అవార్డులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓ వర్గం వారికి అవార్డులను ఎక్కువగా ప్రకటించారనే విమర్శలు వెల్లువెత్త...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...