samaram first look poster

"సమరం" సినిమా చాలా పెద్ద హిట్ అయి ఈ సినిమా హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాన్నారు సెన్సేషనల్

డైరెక్టర్ వి.వి.వినాయక్. సాగర్ గంధం హీరోగా, ప్రగ్య నయన్ హీరోయిన్ గా సుమన్, వినోద్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం సమరం. జననీ క్రియేషన్స్ బ్యానరుపై యూనివర్సల్ ఫిలిమ్స్ సమర్పణలో బషీర్ ఆలూరి దర్శకత్వంలో శ్రీనివాస్ వీరంశెట్టి, పి.లక్ష్మణాచారి సంయుక్తంగా తెలుగు, కన్నడ భాషల్లో సమరం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగె యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని సెన్సషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈరోజు రిలీజ్ చేసారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో హీరో సాగర్ గంధం, దర్శకుడు బషీర్ ఆలూరి, నిర్మాతలు శ్రీనివాస్ వీరంశెట్టి, పోకూరి లక్ష్మణాచారి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ... 'సమరం' టైటిల్ చాలా బాగుంది. పోస్టర్స్ అన్నీ ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. డైరెక్టర్ బషీర్ చెప్పిన కాన్సెప్ట్ కొత్తగా వుంది. డెఫినెట్ గా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా మంచి హిట్ అయి హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్  అన్నారు. 

హీరో సాగర్ గంధం మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా మూడవ సినిమా. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఒక మంచి క్యారెక్టర్ ఈ చిత్రంలో చేశాను. సుమన్, వినోద్ కుమార్ లాంటి పెద్ద యాక్టర్స్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా వుంది. ప్రగ్య హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మా చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ గారికి నా కృతజ్ఞతలు అన్నారు. 

నిర్మాత పోకూరి లక్ష్మణాచారి మాట్లాడుతూ.. మాది మాచర్ల. పల్నాడు ప్రాంతం నుండి వచ్చాను. చిన్నప్పటి నుండి సినిమా అంటే చాలా ఇష్టం. సినిమాలు చూస్తూ పెరిగాను. ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్లి మంచి సినిమా తీయాలని నా కోరిక. డైరెక్టర్ బషీర్ చెప్పిన కథ నచ్చి జననీ క్రియేషన్స్ బ్యానర్ లో 'సమరం' సినిమా తీశాను. షూటింగ్ అంతా పూర్తయింది. రిలీజ్ కి రెడీగా ఉంది. సినిమా నేను ఊహించిన దానికన్నా బాగా వచ్చింది. కచ్చితంగా మా 'సమరం' సినిమా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా వున్నాను.. మా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి నా ధన్యవాదాలు అన్నారు.

దర్శకుడు బషీర్ ఆలూరి మాట్లాడుతూ.. వినాయక్ గారిలాంటి పెద్ద డైరెక్టర్ మా సినిమా మొదటి లుక్ ని విడుదల చేయడం చాలా సంతోషంగా వుంది. ఆయనకి నా థాంక్స్. సినిమా విషయానికి వస్తే .. విలేజ్ నుండి సిటీకి వచ్చిన ఒక ఇంజనీరింగ్ అమ్మాయి సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అవుతుంది. అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేది చిత్ర కథాంశం. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్నితెరకెక్కించాం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఈ చిత్రం ఉంటుంది. మా నిర్మాతలు క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాస్ వీరంశెట్టి మాట్లాడుతూ... తెలుగు కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాం. మా హీరో సాగర్ గారు ఎంతో సపోర్ట్ అందించారు. అలాగే మా చిత్రంలో నటించిన సుమన్, వినోద్ కుమార్, రామ్ జగన్ ఇంకా టెక్నీషియన్స్ అందరూ మాకు సపోర్ట్ చేసి సకాలంలో ఈ సినిమా పూర్తి అవడానికి తోడ్పాటు అందించారు. ఆణి ముత్యాల్లాంటి ఐదు పాటలు, నాలుగు ఫైట్స్ వున్నాయి. అడగ్గానే మా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి మా యూనిట్ తరుపున కృతజ్ఞతలు. త్వరలోనే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరపడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.  

సాగర్ గంధం, ప్రగ్య నయన్, సుమన్, వినోద్ కుమార్, సత్య ప్రకాష్, జహిదా, ప్రియాంశు, సహన, వేణుగోపాల్, జబర్దస్త్ అప్పారావు, చిట్టిబాబు, రాంజగన్, జై, జబర్దస్త్ రాము, రాగిణి, ప్రభావతి, లోకియ (కన్నడ కమేడియన్), జబర్దస్త్ దుర్గ రావు, జయకుమార్, వెంకీ, అనిల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ-మాటలు: నండూరి వీరేష్, కెమెరా: నాగబాబు కర్ర, ఎడిటర్: శ్రీనుబాబు, సంగీతం: రాజ్ కిరణ్, లిరిక్స్: రామారావు, ఫైట్స్: అవినాష్, కొరియోగ్రఫీ: కపిల్ రమేష్, నరేష్ ఆనంద్, మేకప్: పీటర్, కాస్ట్యూమ్స్: అంజి, ఆర్ట్: సురేష్ భాను, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.డేవిడ్, కో- ప్రొడ్యూసర్: ప్రగ్యానయన్,  నిర్మాతలు: శ్రీనివాస్ వీరంసెట్టి, పోకూరి లక్ష్మణాచారి, కథ-మాటలు: నండూరి వీరేశ్, స్క్రీన్-ప్లై దర్శకత్వం: బషీర్ ఆలూరి..

e-max.it: your social media marketing partner

పార్టీ మార్పుపై విజయశాంతి సంచలన ప్రకటన...

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి తన పార్టీ మార్పు విషయంపై ఈ రోజు ఓ సంచలన ప్రకటన...

బోండా ఉమా పార్టీ మార్పుపై... బుద్ధా వెంకన్న మాట

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ నేత బోండా ఉమ సమావేశమయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో ఉమ

విజయసాయి రెడ్డి ఒక కౌన్‌ కిస్కా గొట్టం...

విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక కౌన్‌ కిస్కా గొట్టం... అతని మాటలకు విలువలేదు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ...

రాజధాని మార్పుపై ఎంపీ విజయసాయి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను సంప్రదించే తీసుకుంటున్న...

2021 జనాభా లెక్కలకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: 2021 జనాభా లెక్కలకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచ...

భయంతో ఇంటికెళ్ళాను... కారు ప్రమాదంపై రాజ్ తరుణ్ క్లారిటీ

హైదరాబాద్: తన కారు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. సోమవారం అర్ధ‌రాత్రి మణికొండ మున్సిపాలిటీ పరిధిల...

సంజౌతా, థార్ ఎక్స్‌ప్రెస్ లను ఆపేసిన పాక్...

ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 ని రద్దుపై అసహనంగా ఉన్న పాకిస్తాన్, సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసు...

ఆర్టికల్ 370 రద్దు చట్ట వ్యతిరేకం... పాకిస్థాన్

ఇస్లామాబాద్‌: జమ్ము కాశ్మీర్ లో భారత ప్రభుత్వం చేసిన ఆర్టికల్ 370 రద్దు చట్టవ్యతిరేకమంటూ పాకిస్థాన్‌ విదేశాంగ...

చిదంబరం ఏ క్షణమైన అరెస్ట్...

ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి. చిదంబరం అరెస్ట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐఎన్ఎక్స...

కోర్టు ఎదుట సీఎం మేనల్లుడు...

ఢిల్లీ: మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురి ఈ రోజు కోర్టు ఎదుట హాజరుకానున్నారు. గతంలో ఆయన సెంట్రల్...

చిదంబరానికి సుప్రీం షాక్...

ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరంకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఐఎన్‌ఎక్స్‌...

ఈ-బీజ్ సంస్థ భారీ మోసం... ఎండీ అరెస్ట్

హైదరాబాద్: ఈ-బిజ్ సంస్థ ఎండీ పవన్ మల్హన్, ఆయన కుమారుడు హితిక్ మల్హన్‌లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మల...

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా... ‘మహానటి’

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా... ‘మహానటి’

ఢిల్లీ: కథానాయిక సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రానికి ఉత్తమ జాతీయ చలన చిత్ర అవార్డు వరించి...

కాజల్ తో డేటింగ్... రూ.60 లక్షలు పోగొట్టుకున్న అభిమాని

కాజల్ తో డేటింగ్... రూ.60 లక్షలు పోగొట్టుకున్న అభిమాని

చెన్నై: తన అభిమాన హీరోయిన్ కాజ‌ల్ ని కలవడం కోసం తమిళనాడుకు చెందిన ఓ వీరాభిమాని ఏకంగా రూ.60 ల‌క్ష‌లు పోగొట్టుకు...

భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలి: గంగూలీ

ఢిల్లీ: ఇక భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలన్నారు టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ. రాహుల్‌ ద్రవిడ్‌కు బీసీసీఐ అ...

పట్టుబిగించిన ఇంగ్లాండ్... వరల్డ్ కప్ ఫైనల్

లండన్: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ vs న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో ఇ...

రూపాయి పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...

భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

ఢిల్లీ: ఆర్‌బీఐ వరుసగా నాలుగో సారి రెపో రేటును తగ్గించింది. 35 బేసిస్‌ పాయింట్ల మేర భారీగా తగ్గిస్తూ ప్రకటన వె...