యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో
సాహోలో తనకు సంబంధించిన మరో లుక్ ను విడుదల చేశారు. ''హియర్ ఇట్ ఈజ్ డార్లింగ్స్ ఆల్ ఆఫ్ యు.. నా నెక్ట్స్ మూవీ `సాహో`కి సంబంధించిన కొత్త పోస్టర్. ఆగస్ట్ 15న థియేటర్స్లో కలుద్దాం'' అంటూ ఒక మెసేజ్ కూడా రాశారు. ఇకపోతే స్ర్టైలిష్ గా గాగుల్స్ ధరించిన లుక్ లో ప్రభాస్ యూత్ ని ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్ కు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా..ఆగస్ట్ 15వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.