కిషోర్ రాఠి సమర్పణలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అలీ మెయిన్ లీడ్ పోషిస్తున్న చిత్రం 'రంగుపడుద్ది'. ధనరాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావుల తారాగణంతో

రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్. శ్యామ్ ప్రసాద్ దర్శకుడు కాగా.. మహేష్ రాఠి నిర్మాత. మే నెలలో విడుదలవుతున్న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమేశంలో నటుడు ధన్ రాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి కారకుడైన అలీ గారు లండన్ లో షూట్ తో బిజీ గా ఉండటం మూలన ఈ కార్యక్రమంలో  పాల్గొనలేకపోయారు. సినిమా విషయానికి వస్తే అప్పట్లో ఇదే మనీషా బ్యానర్ లో బ్లాక్ బస్టర్ అయిన ఘటోత్కచుడు చిత్రంలో ఫేమస్ అయిన రంగుపడుద్ది డైలాగ్ నే ఇప్పుడు టైటిల్ గా పెట్టి మళ్లీ ఇదే బ్యానర్ లో ఓ మంచి కామెడీ హారర్ ను తెరకెక్కిస్తున్నారు. మనీషా ఫిలిమ్స్  బ్యానర్ కు మేము పెద్ద ఫాన్స్. అలాంటి బ్యానర్ లో మేము సినిమా చేయడం ఆనందం గా ఉంది. ఇక కథ విషయానికి వస్తే  ఇద్దరి గ్యాంగ్ మధ్య జరిగే గొడవ చుట్టే కథ తిరుగుతుంది. దాన్నే ఔట్ అండ్ ఔట్ కామెడీ తో తెరకెక్కించారు దర్శకుడు శ్యామ్ ప్రసాద్. ఆయన తీసిన మౌనమేలనోయి చిత్రానికి అందులో పాటలకు నేను వీరభిమానిని. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. యమాలీల చిత్రంలో చినుకు చినుకు పాటను మళ్లీ ఇప్పుడు అప్పారావు కు హీరోయిన్ కు మధ్య కంపోజ్ చేశారు. అప్పుడు ఆ చిత్రం మ్యాజిక్ చేసింది ఇప్పుడు అదే మ్యాజిక్ చేయనుందని భావిస్తున్నా..   మే మొదటి వారం కానీ రెండో వారంలో కానీ ఈ మా రంగుపడుద్ది  సినిమా ఉండనుందని తెలిపారు. దర్శకుడు ఎస్. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. చాలా కాలం తరువాత ఇదే బ్యానర్ లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒక బంగ్లా లో ఇద్దరి గ్యాంగ్ మధ్య చోటు చేసుకునే ఘర్షణే చిత్ర కథాంశం. పూర్తి స్థాయి హారర్ కామెడీ తో తెరకెక్కిన ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నా అన్నారు.  

నిర్మాత మహేష్ రాఠి మాట్లాడుతూ.. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు చిన్న పిల్లల్ని సైతం ఈ మా రంగుపడుద్ది చిత్రం ఎంటర్టైన్ చేస్తుంది. చెప్పాలంటే ఈ సమ్మర్ వెకేషన్ కు కూల్ ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం అవుతుందని అన్నారు. హీరోయిన్ హీన, అప్పారావు, షేకింగ్ శేషు లు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను, అభినందనలు పంచుకున్నారు. ఆలీ, రఘుబాబు, ధనరాజ్, జబర్దస్త్ అప్పారావు, సుమన్ శెట్టి, షేకింగ్ శేషు, హీన ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి

కథ : మహేష్ రాఠి, డైలాగ్స్: అభయ్ శ్రీ జయ్, మ్యూజిక్: సుభాష్ ఆనంద్, ఎడిటర్: నందమూరి హరి, డిఓపి: జి. ఎస్. రాజ్ (మురళి), నిర్మాత: మహేష్ రాఠి, డైరెక్టర్: ఎస్. శ్యామ్ ప్రసాద్.

e-max.it: your social media marketing partner

జగన్ సీఎం...నా గెలుపు ఖాయం..

ఏపీలో ఫ్యాన్ గాలి వీస్తోందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే

ముగిసిన విపక్షాల భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో గల కానిస్టిట్యూషన్

సీఎం నివాసం వద్ద భద్రత పెంపు

గురువారం ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద

శ్రద్ధ ఆస్పత్రిని సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో శ్రద్ధ ఆస్పత్రి చేసిన అక్రమాలు వెలుగులోకొచ్చాయి. కనీసం మెడికల్ కౌన్సిల్ గ...

ఎన్నికల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

తెలంగాణలో ఎన్నికల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు టీఎస్ ఎన్నికల నిర్వహణాధికారి రజత్ కుమార...

1కి.మీకు రూ.2 మాత్రమే...

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట మెట్రోస్టేషన్‌ వద్ద వాహన ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ కేంద్రం, స్మార్ట్‌ పార్కింగ్‌ సదు...

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో గల పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.32 గంటల సమయంలో

మసూద్ విషయంలో సానుకూలంగా స్పందించిన చైనా

మసూద్ అంశంపై చైనా సానుకూలంగా స్పందించింది. యూఎన్‌ సమావేశానికి ఒకరోజు ముందు

ఈవీఎంల లెక్కింపు తర్వాతే...

కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని ఈసీ స్పష్టం చేసింది. వీవీ ప్యాట్ల లెక్కింపుపై

అండమాన్ దీవులను వణికిస్తోన్న భూ కంపాలు

అండమాన్ నికోబార్ దీవులను వరుస భూ కంపాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అక్కడి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని

స్కూల్ బస్సుపైకి దూసుకెళ్లిన లారీ

హైదరాబాద్ లోని ఖాజాగూడ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన

 కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి నోటీసులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి వైద్య ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. రేపటి లోపు

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

చెన్నై: గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం అంటూ... బాధపడుతున...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

హైదరాబాద్: 50 రోజుల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే చెరో మూడు సార్లు కప్పు ఎగరేసుకు పోయిన ఆ ర...

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో భాగంగా రేపు ఉప్పల్ వేదికగా ముంబై-చెన్నై మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...