Print
Hits: 89

తమిళ్ తలైవా రజనీకాంత్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానులకు

ఆయన శుభవార్త చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సినీ నటుడు రజనీకాంత్ తమిళనాడులో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మెజారిటీ లేక అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోతే.. ఆ తర్వాత జరిగే శాసనసభ సమరంలో బరిలోకి దిగుతారా అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు రజనీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించాక తుది నిర్ణయం చెప్తానన్నారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశ ప్రకటనను నటుడు, మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ స్వాగతించారు. 

e-max.it: your social media marketing partner