ఎన్టీఆర్ బయోపిక్ మొదలైనప్పటి నుంచి, ఆ సినిమా విడుదలకై ఎంతో ఆతృతగా ఎదురు చుసిన అభిమానుల కల ఈరోజు నిజమయ్యింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో

రెండు భాగాలుగా (కథానాయకుడు, మహానాయకుడు) రూపొందించిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర తొలి భాగం ఎన్టీఆర్-కథానాయకుడు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో ఎంతో ఖ్యాతి గడించిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జీవిత కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. 

కథ:

ఎన్టీఆర్ భార్య బసవతారకం (విద్యాబాలన్) క్యాన్సర్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటుంది. ఆ సందర్భంలో తనకు ఎన్టీఆర్ తో పెళ్లి జరిగిన తరువాత రకరకాలుగా మలుపులు తిరిగిన తన భర్త జీవితానికి సంబంధించిన ఆల్బమ్ తిరగేస్తూ గుర్తు చేసుకుంటుంది. ఇక అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. 

ఎన్టీఆర్ కు సినిమాల‌పై వ్యామోహం ఎందుకు పెరిగింది... సినిమాల్లో ఎలా ఎదిగాడు... ఒక సాధార‌ణ రైతు బిడ్డ గొప్ప ప్రేక్షక ఆదరణ పొందిన నటుడిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఎలా వెళ్లాడన్న‌ది సినిమా క‌థ‌. ఎన్టీఆర్ సినీ జీవితంతో మొద‌లైన చిత్రం.. ఎన్టీఆర్ తెలుగుదేశం ప్ర‌క‌ట‌న‌తో ముగుస్తుంది.

అసలు కథలోకి వెళితే... దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం రిజిస్టరాఫీసులో ఉద్యోగంలో చేరతాడు ఎన్టీఆర్. అక్కడ అవినీతిని తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసి... అనంతరం సినీ రంగంలోకి అడుగు పెడతారు. సినిమాల్లో జానపద, పౌరాణిక వంటి కథల్లో జనాల్ని మెప్పించి అతి పెద్ద స్టార్ గా వెలుగొందుతాడు. సినీ ప్రస్థానం ముగుస్తున్న సమయంలో, ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) స్థాపిస్తాడు. ఇంతటితో "ఎన్టీఆర్-కథానాయకుడు" తొలి భాగం ముగుస్తుంది.

ఎలా ఉంది:

ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే... ఎన్టీఆర్ సినిమాలో సగటు ప్రేక్షకుడు ఆశించే ముఖ్యమైన పాయింట్స్ ఏవి లేవు. కథ మరీ అందరికి తెలిసినట్టుగానే.... ఫ్లాట్ గా, స్లో గా సాగిపోతుంది. దీనికి తోడు యంగ్ ఎన్టీఆర్ గ బాలకృష్ణ కూడా అంతగా ఆకట్టుకోలేక పోయాడు. కథ నుఁడిస్తున్న కొలది బాలకృష్ణ ఎన్టీఆర్ లో లీనమైనట్టు మనకు అనిపిస్తుంటుంది. కానీ సినిమా రెండవ అర్ధ భాగంలో వయసొచ్చాక ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అతికినట్టుగా సరిపోయాడు. సినిమా ప్రారంభలో ఒక దశ దాటాక ప్రేక్షకులకు బోర్ కొట్టక తప్పదు. సినీ రంగంలో ఎన్టీఆర్ వేసిన ముద్ర గురించి చూపించే రెండు మూడు ఎలివేషన్లు మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. అందులో ఒకటి ‘మాయా బజార్’ సినిమా కోసం తొలిసారి కృష్ణుడి పాత్రలోకి ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేయడం అద్భుతంగ అనిపిస్తుంది. ఈ సన్నివేశంలో దర్శకుడు క్రిష్ బలమైన ముద్ర వేశాడు. ఈ సన్నివేశానికి రాసిన లీడ్.. చిత్రీకరణ.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్కోర్.. అన్నీ కూడా గొప్పగా కుదిరి ప్రేక్షకుల్లో ఒక ఉద్వేగం కలుగుతుంది. అలాగే ‘సీతా రామ కళ్యాణం’ సినిమాతో దర్శకత్వం చేపట్టిన ఎన్టీఆర్ ఆ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం.. ఆపై ‘దాన వీర శూర కర్ణ’ కోసం చేసిన సాహసం.. వీటికి సంబంధించిన ఎపిసోడ్లను దర్శకుడు బాగా చిత్రించారు. ఇంతకుమించి సినిమాలో హై పాయింట్స్ ఏక్సపెక్ట్ చేయొద్దు. ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ మరణానికి సంబంధించిన ఎమోషనల్ సీన్ ప్రేక్షకులను కొంచెం కదిలిస్తుంది. సినిమా ప్రథమార్ధం వరకు అయితే కృష్ణుడి సీన్.. కొడుకు మరణానికి సంబంధించిన రెండు మూడు సీన్లు మాత్రమే కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తాయి. యుక్త వయసులో ఉన్న బాలయ్య సెట్టవ్వకపోవడం వల్ల ప్రథమార్ధంలో చాలా సీన్లు అంత మెప్పించావు.

నటి నటులు:

బాలకృష్ణ తన తండ్రి పాత్రలో కథానాయకునిగా ఒదిగిపోయేందుకు తీవ్రంగానే శ్రమించాడు. కానీ మొదట్లో బాలకృష్ణను యువ ఎన్టీఆర్ గా ఒప్పుకోవడానికి.. ప్రేక్షకులు రాజి పడాల్సిందే. బాలయ్య లుక్, మేకప్, ఆయన ఆహార్యం యంగ్ ఎన్టీఆర్ పాత్రకు కుదరలేదు. ఐతే సినిమా నడుస్తున్న కొలది అలవాటు పడతాం. నెమ్మదిగా బాలయ్య మెప్పిస్తూ, మెప్పిస్తూ వెళ్లాడు. సినిమా పతాక సన్నివేశాల్లో మాత్రం బాలయ్య నటన హైలైట్ గా నిలుస్తుంది. ఇక ఎన్టీఆర్ భార్య బసవతారకంగా విద్యాబాలన్ హుందాగా నటించింది. ఏఎన్నార్ పాత్రలో ఆయన మనవడు సుమంత్ చక్కగా నటించాడు. ప్రతి సన్నివేశంలోనూ తనదైన ముద్ర వేస్తూ... హావభావాలను సహజంగా చూపించాడు. ఇక ఎన్టీఆర్ కొడుకుగా హరికృష్ణ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ ఓకే అనిపించాడు. నాగిరెడ్డిగా ప్రకాష్ రాజ్.. చక్రపాణిగా మురళీ శర్మ.. ఎన్టీఆర్ తమ్ముడి పాత్రలో దగ్గుబాటి రాజా సెట్ అయ్యారు. సాయిమాధవ్ బుర్రా.. నిత్యా మీనన్.. రకుల్ ప్రీత్.. హన్సిక మోత్వానీ, కైకాల సత్యనారాయణ.. క్రిష్.. లాంటి వాళ్లు అతిథి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం:

'ఎన్టీఆర్-కథానాయకుడు’లో సాంకేతిక నిపుణుల పాత్ర మరువలేనిది. సంగీత దర్శకుడు కీరవాణి తన అనుభవాన్నంతా చూపించాడు. ఎన్టీఆర్ తొలిసారి కృష్ణుడి పాత్రలో కనిపించే సన్నివేశానికి ఆయన ఇచ్చిన మ్యూజిక్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ మరణించిన సమయంలో ఎమోషనల్ సీన్లకు కూడా కీరవాణి తన సంగీతంతో బూస్ట్ ఇచ్చారు. సినిమాలోని పాటలు, వాటి మ్యూజిక్ ఇతరానికి నాచే విధంగా ఉన్నాయి. కెమెరామన్ జ్ఞానశేఖర్ ప్రతి సీన్ ను అద్భుతంగ చూపించాడు. 1950-80 మధ్య కాలాన్ని కళ్లకుకట్టినట్టు చూపించడంలో... అప్పటి వాతావరణం తెరపై ప్రతిబింబించేలా చేయడంలో ఆయన పనితనం తెలుస్తుంది. అప్పటి ఫిలిం స్టూడియోల్లోని వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడంలో ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభ బాగుడనిపిస్తుంది. నిర్మాణ విలువల విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడ లేదు. అంతటా ఒక స్థాయి కనిపిస్తుంది. ఈ సినిమాకి మాటలందించిన సాయిమాధవ్ బుర్రా అక్కడక్కడా కొన్ని మంచి మాటలు రాశాడు. ఇక దర్శకుడు క్రిష్.. ఎన్నో పరిమితుల మధ్య ఉన్నంతలో 'ఎన్టీఆర్-కథానాయకుడు' కథను బాగానే తీర్చిదిద్దాడు. కానీ... కథనంలో ఇంకొంచెం స్పీడ్ ఉండి ఉంటే.. ఎన్టీఆర్ సినీ జీవితంలోని  ఇంకొన్ని హై పాయింట్లతో స్క్రిప్టును సరిచేసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది.

రేటింగ్: 3.5/5

e-max.it: your social media marketing partner

సీఎం జగన్ తో జనసేన ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం

అమరావతి: సీఎం వైఎస్ జగన్ తో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు భేటీ అయ్యారు. ఈరోజు ప్రారంభమైన అస...

ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం...

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11 గంటలకు తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం క...

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ తీర్మానంపై చర్చ

అమరావతి: ఏపీ ప్రజలు పూర్తి నమ్మకంతో జగన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారన్నారు ప్రభుత్వ విప్‌ ముత్యాల నాయుడు. ఈ...

ప్రకాశం జిల్లా ప్రజలకు మంత్రి హామీ...

అమరావతి: ప్రకాశం జిల్లాలో ప్రజలకు, రైతులకు సాగు, తాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి బాలినేన...

మాదాపూర్ నిఫ్ట్ లో లైంగిక వేధింపులు...

హైదరాబాద్: మాదాపూర్ లోని నిఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. మాదాపూర్ లోని నే...

కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుంది... మంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుంద...

అధికార, ప్రతిపక్షాలతో మోడీ భేటీ

శ్రీలంక: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు శ్రీలంక వెళ్లారు. ఈ సందర్భంగా మోడీకి శ్రీలంక ప్రధానమంత్రి ర...

అమెరికాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

వాషింగ్టన్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమెరికాలో టిఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో తెలుగు...

మనం ప్రజల కోసం పని చేస్తున్నాం... మోడీ

ఢిల్లీ: పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు విభేదాలు పక్కనబెట్టి దేశ ప్రగతికై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రధాని...

మోడీకి విజ్ఞప్తి చేశాం... విజయసాయి రెడ్డి

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తామని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరె...

ఉద్యోగాలిప్పిస్తానంటూ... మహిళ ఘరానా మోసం

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించిన ఓ మహిళ ఏకంగా 1...

బాయిలర్‌ పేలి ముగ్గురు కార్మికుల మృతి...

విజయనగరం: బొబ్బిలి పారిశ్రామికవాడలోని బాలాజీ కెమికల్స్‌ పరిశ్రమలో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ పరిశ్ర...

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాలా పెద్ద హిట్ అయి ఈ సినిమా హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాన్నారు సెన్...

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

టాస్ గెలిచిన బాంగ్లాదేశ్... వెస్టిండీస్ బ్యాటింగ్

టాంటన్: ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు వెస్టిండీస్ బాంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లాదేశ...

భారత్, పాక్ మ్యాచ్ కు వర్షం ముప్పు... అభిమానుల్లో టెన్షన్

మాంచెస్టర్: భారత్ పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచును కూడా వర్షం ముంచెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్ లో...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...