బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స్‌లో కొంకణీ సంప్రదాయ పద్దతిలో అతికొద్ది
మంది అతిథుల నడుమ వారిద్దరూ వివాహం చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. దీపికా సారస్వత్ బ్రాహ్మిణ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మొదట వారు కొంకణీ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. కొంకణీ సాంప్రదాయం ప్రకారం దీపికా తండ్రి ప్రకాశ్ పదుకొనే.. రణ్వీర్ సింగ్ కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. పెళ్లి కోసం దీపికా వైట్ అండ్ గోల్డ్ సబ్యసాచి చీరలో అందంగా తయారవగా.. రణ్వీర్ సింగ్ కంజీవరం షేర్వాణీలో అదిరిపోయాడు. సోమవారం సాయంత్రమే ఈ ఇద్దరూ రింగ్స్ మార్చుకోగా... మంగళవారం ఘనంగా సంగీత్ సెర్మనీ జరిగింది... ఈరోజు జరిగిన పెళ్లితో బాలీవుడ్ లో మరో జంట ఒక్కటైంది.