no gst for under 4 crore budget movies

అమరావతి: చిన్న బడ్జెట్‌ సినిమా నిర్మాతలకు ఏపీ పెద్ద శుభవార్త చెప్పింది. రాష్ట్ర జీఎస్‌టీ నుంచి చిన్న సినిమాలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం

తీసుకుంది. ఈ విషయంపై సినీ నిర్మాత మరియు ఏపీ చలన చిత్రమండలి అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికా కృష్ణ మీడియాతో మాట్లాడారు. చిన్న సినిమా బతికితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందనే ఉద్దేశ్యంతో ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంబికా కృష్ణ చెప్పారు. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తీసే సినిమాలకు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 18శాతంలో రాష్ట్ర జీఎస్టీ 9శాతం తొలగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే చిన్న సినిమాలకు రాష్ట్రంలోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేయాలనే నిబంధన కూడా పెట్టామన్నారు. వాణిజ్య పన్నులశాఖ లెక్కల ఆధారంగా రీయింబర్స్ మెంట్ చేస్తామని అంబికా కృష్ణ వెల్లడించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తీసిన 10 చిన్న సినిమాలకు ప్రతి ఏడాది ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని తెలిపారు. ఏపీలో షూటింగ్‌ల కోసం సింగిల్‌ విండో విధానంలో చిన్న సినిమాలకు అనుమతులు ఇస్తామని చెప్పారు. స్టూడియోల కోసం అమరావతిలో ఫిలిం సిటీకి స్థలం కూడా సీఎం కేటాయించారు. ఏపీ, తెలంగాణలో సినిమా థియేటర్లు కొందరి చేతిలోనే ఉన్నాయన్న విషయం వాస్తవమేనన్నారు. రాష్ట్రంలో సినిమా చిత్రీకరణపై సినీ నటీ నటులు సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు. చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్మాతలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు చిన్న సినిమా నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సినిమా రంగాన్ని పదిల పరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పలు ఆఫర్లు ప్రకటిస్తోంది. హైదరాబాదులో 2 వేల ఎకరాల్లో సినిమా స్టూడియోల నిర్మాణాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. చిత్రపురి కాలనీలో కార్మికులకు సబ్సిడీతో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు. 

e-max.it: your social media marketing partner

కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం...

హైదరాబాద్: ఓటరు నమోదు, ఓటరు జాబితాపై జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఓటరు నమోదుపై ప్రత...

ఏపీ అసెంబ్లీ షెడ్యూల్...

అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 7 వరకు శాసనసభ, శాసన మండలి సమావేశ...

లండన్ టూర్ రద్దు చేసుకున్న జగన్...

అమరావతి: వైసీపీ అధినేత జగన్‌ లండన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. సుమారు 15 నెలల అనంతరం... సుదీర్ఘ...

దమ్ముంటే ఏపీలో అడుగుపెట్టు... కేసీఆర్‌ కు నుడా ఛైర్మన్‌ సవాల్

అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు దమ్ముంటే... ఏపీలో అడుగుపెట్టాలని సవాల్ విసిరారు నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్ర...

తెలంగాణ అసెంబ్లీ వాయిదా...

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కొత్తగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్య...

ప్రమాణ స్వీకారానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు ఈరోజు జరుగుతున్న ప్రమాణ స్వీకారానికి రావాల్సిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైరుహాజరయ్యారు....

భారత్ లో ఈరోజు ఎంత మంది పుట్టారో చెప్పిన యూనిసెఫ్... మనమే టాప్

ఢిల్లీ: నూతన సంవత్సరం తోలి రోజున భారత్‌లో ఎంత మంది జన్మించారో యునిసెఫ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. యునిసె...

ఓటు హక్కు వినియోగించుకున్న బంగ్లాదేశ్ ప్రధాని

ఢాకా: బంగ్లాదేశ్ లో జరుగుతున్న సాధారణ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల...

1500 మందిని కాపాడిన యువకులు

ఇద్దరు యువకులు చేసిన సాహసం 1500 మంది ప్రయాణికులను కాపాడింది. తమ ప్రాణాలను

ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి పచ్చ జెండా...

ఢిల్లీ: మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లు చట్టంలోకి వచ్చింది. అగ్రవర్ణాల పేదలన...

డేరా బాబాకు జీవిత ఖైదు...

ఢిల్లీ: డేరా బాబా గా పేరొందిన గుర్మీత్ రామ్ రహీమ్‌కు పంచకుల స్పెషల్ సీబీఐ కోర్టు గురువారం జీవిత ఖైదు విధిస్తూ...

అత్యాచార ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి

హైదరాబాద్ లోని పాతబస్తీ కామాటిపురా పీఎస్ లిమిట్స్ లో మైనర్ పై జరిగిన

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

"జనవరి 18న నందమూరి రామా రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ జీవం ప...

బ్రహ్మానందం సేఫ్...

బ్రహ్మానందం సేఫ్...

హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన...

కోహ్లీసేనకు ప్రముఖుల ప్రశంసల వర్షం

దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్

గవాస్కర్, రవిశాస్త్రి ఒకరిపై ఒకరి కౌంటర్లు

భారత క్రికెట్ దిగ్గజం గవాస్కర్ చేసిన కామెంట్లకు భారత కోచ్ రవిశాస్త్రి కౌంటర్ ఇచ్చాడు... సహజంగానే విమర్శలు నచ్చ...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...