vijetha movie box office result

మెగా కాంపౌండ్ నుంచి హీరో వస్తున్నాడంటేనే... టాలీవుడ్లో ట్రేడ్లో విపరీతమైన డిస్కషన్. ఇప్పటికే ఆల్మోస్ట్ క్రికెట్ టీం మాదిరిగా తయారైన మెగా హీరోల బ్యాచ్... తాజాగా మరో హీరోని తీసుకువచ్చి నిర్మాతల నెత్తిమీద రుద్దింది. మెగా గూటినుంచి తాజాగా వచ్చిన ఆ హీరోనే కళ్యాణ్ దేవ్ ఇతడు చిరంజీవి చిన్నల్లుడు. విజేతగా వచ్చి నిర్మాతను పరాజితుడుని చేశాడు. ఇప్పుడిదే టాలీవుడ్ మార్కెట్లో హాట్ డిస్కషన్ కు కారణమైంది.

మెగా గూటినుంచి ఒక హీరో వస్తున్నాడంటేనే... బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు వణుకు పుడుతుంది. అలాగని చెప్పి ఆ వచ్చే హీరో చిత్రం తాలూకు హక్కులను కొనకుండా ఉంటారా అంటే అదీ లేదాయె.. ఎక్కడ చిత్రాన్ని తీసుకోకపోతే మార్కెట్లో వీకై తామోననే భయం... బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లను వెంటాడుతుంటుంది. అదే సెంటిమెంట్ ను మెగా కాంపౌండ్ తెలివిగా క్యాష్ చేసుకుంటూ తమ గూటినుంచి మన మీదకు మరింతమంది హీరోలను పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా కళ్యాణ్ దేవ్ చిరు చిన్నల్లుడిగా వచ్చి... ప్రేక్షకులను, నిర్మాతలను, బయ్యర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లను బాగా బుక్ చేసి పడేశాడు. విజేత చిత్రాన్ని నిజానికి మెగా కాంపౌండ్ వారే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. కాని మార్కెట్లో తన కాంపౌండ్ కున్న డిమాండ్ ను ఎరగా వేసి... బయట వారికి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను అంట గట్టిపడేశారు.

ఆ విధంగా నష్టపోయే అదృష్టాన్ని తాంబూలంలో పెట్టి మరీ సాయికొర్రపాటికి ఇచ్చారా అనిపిస్తుంది.

ఇక్కడ చిరు చిన్నల్లుడు హీరో మెటీరియల్లా కాదా అనే ఆలోచన ముందుగా సాయికొర్రపాటికి వచ్చి ఉండాలి. కేవలం కొత్త మెగా వారసుడిని తానేదో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాననే అత్యుత్సాహంతో... చిరంజీవి దగ్గరికి నేను చేస్తానంటూ ఎగేసుకు వెళ్ళిపోవడం సాయి కొర్రపాటి చేసిన ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ గా కనిపిస్తుంది. ఒకవేల ఈ నిర్మాత సినిమాకు కమిటైనప్పుడే.... ప్రేక్షకుల్లో కళ్యాణ్ దేవ్ పై ఉన్నటువంటి అంచనాలను కూడా పరిగణలోకి తీసుకోవల్సిఉంది. బట్ ఆ విషయాలను పూర్తిగా నెగ్లెట్ చేయడంతో ఇవ్వాల నిర్మాత తన చేతి చమురును వదిలించుకోవల్సి వచ్చింది.  

 

విజేత చిత్రంలో కథానాయకుడు తండ్రి పాత్ర పోషించిన మురళీశర్మకే మార్కులు పడ్డాయి. ఈ సినిమా రెండు రోజులైనా థియేటర్లలో ఉండగిలిందంటే ఆ క్రెడిట్ పూర్తిగా మురళీ శర్మకే ఇవ్వాల్సిఉంటుంది. ఇదే విషయాన్ని స్వయంగా చిరంజీవే ఒప్పుకున్నాడు. తన అల్లుడు ఇంకా నేర్చుకోవల్సింది ఉందనే చురకను అంటించాడు. మరి చిరు అల్లుడు నటుడుగా పర్ ఫెక్ట్ కానపుడు సినిమా చేయడానికి ఎందుకు ఒప్పుకున్నట్లు.

కేవలం కళ్యాణ్ దేవ్ అనే కాదు. త్వరలో రాబోతోన్న సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ను కూడా ఎవరో బయట నిర్మాతకు అంటగట్టే ప్రయత్నాలే జరుగుతున్నాయి. ముందునుంచి మెగా కాంపౌండ్ స్క్రాప్ బయటోళ్లకు... స్టఫ్ ను తాము వాడుకుంటుందనే టాక్ ఉండనే ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇదే జరగబోతోందా...

విజేత చిత్రం 7కోట్లతో తెరక్కిందనే వారున్నారు..10 కోట్ల లెక్కతో ఫైనల్ గా ఖర్చు తడిసి మోపిడయిందనే వారు ఉన్నారు. ఇక వసూల్ల పరంగా చూసుకునే సరికి ఈ సినిమా కనీసం 50 లక్షలను కూడా కూడగట్టలేదనే నిజం ఇపుడు టాలీవుడ్ ట్రేడ్ మార్కెట్లో ప్రకంపణలను సృష్టిస్తుంది. అందుకేనేమో గత కొన్ని రోజుల నుంచి మెగా కాంపౌండ్ ఇచ్చిన హామి గురించి నిర్మాత సాయి కొర్రపాటి చిరు ఇంటిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడట.

నిర్మాత సాయికొర్రపాటికే అని కాదు... ఎంతోమంది నిర్మాతలు బడా హీరోల కాంపౌండ్ ల చుట్టూ ఇలాగే తిరుగుతూ కేవలం పర్సనల్ ఇమేజ్ ను హైప్ చేసుకోవడం కోసం అన్నట్లుగా తమ విలువైన సమయాన్ని, సంపదను పోగొట్టుకుంటున్నారు. ఇవ్వాల ఆ లిస్ట్ లో ముందుగా సాయి కొర్రపాటి తేలాడు. రానున్న రోజుల్లో ఇంకెంతమంది నిర్మాతలు బడా హీరోలతోటి, వారి వారసులతోటి చిత్రాలు చేసి చేతులు కాల్చుకుంటారో తెలియకుండా ఉంది. సో ఇక్కడ సివిఆర్ న్యూస్ చెప్పేదొక్కటే. గొప్పలకు పోయి ఉన్న అర్హతలేనివారితో అందలమెక్కించే ప్రయత్నంలో తాము బొక్కబోర్లాపడకూడదు.

e-max.it: your social media marketing partner

రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కే మద్దతు

మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కు

ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయిందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌. రేపు ఉదయం...

దిమ్మతిరిగి బొమ్మకనబడేలా ప్రజా తీర్పు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి కోలుకోలేని దెబ్బతగిలిందని, బీజేపీకి

జాలర్ల కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి కళా

పాక్ అదుపులోని రాష్ర్ట జాలర్ల కుటుంబాలను

టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష (టీఆర్‌ఎస్‌ఎల్పీ) నాయకుడిగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన 88 మంది అభ్యర్...

పార్లమెంట్ లో కూడా ఇలాగే గెలుస్తాం..

తెలంగాణలో నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

రాహుల్ కు బహుమతిగా రాజస్థాన్

రాజస్థాన్ హస్తగతం కానుంది. ఇక్కడి ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. మొత్తం 199

మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో కాంగ్రెస్

రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు

డీఎస్పీ కుమారుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీటెక్ విద్యార్థి శ్రీనివాసులు

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...