దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి విచారణకు హాజరుకానున్నారు. జీఎస్టీ సినిమా సామాజిక కార్యకర్త దేవీపై అనుచిత వ్యాఖ్యల నేపధ్యంలో రేపు మరోసారి సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులు విచారించనున్నారు. మొదటిసారి మూడున్నర గంటలపాటు విచారించిన పోలీసులు రెండోసారి విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడగాలో వాటికోసం ప్రత్యేక నివేదికనే సిద్ధం చేసుకున్నారు.

ఇప్పటికే ఆయన ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకొని ఎఫ్ఎస్ఎల్ కి పంపిన సిసిఎస్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తోంది. సామాజిక కార్యకర్త దేవీ ఇచ్చిన ఫిర్యాదుతో వర్మకు సైబర్ క్రైం పోలీసులు రెండుసార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. మొదటిసారి హాజరుకాని వర్మ రెండోసారి గత శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో పోలీసుల ఎదుట హాజరైనాడు. మూడున్నర గంటలపాటు 24 ప్రశ్నలు సంధించిన పోలీసులు ఆయన నుండి కొంత విషయాన్ని రాబట్టారు. అయితే జీఎస్టీ సినిమా తన వ్యక్తిగతమే అన్న వర్మ ఆ సినిమాను పోలాండ్ లో తీసానని చెప్పడం. అది కేవలం స్కైపే ద్వారా మాత్రమే చిత్రీకరించబడిందని చెప్పారు. దీంతో వర్మ ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్న సైబర్ క్రైం వింగ్ దానిని ఎఫ్ఎస్ఎల్ కి పంపింది. ఆ తరువాత ఆయన పాస్ పోర్టును సైతం విచారించింది. ఇక ఈ షాట్ ఫిలింకి సంగీత దర్శకుడిగా వ్యవహరించిన కీరవాణికి సైతం నోటీసులు రెడీ చేశారు. అయితే కీరవాణిని అతని ఇంటి వద్దే విచారించే అవకాశాలున్నాయి. జిఎస్టి సినిమాతో ఆర్జివికి ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు.

ఈ సినిమాకు సంగీతం అందించమని కీరవాణిని కోరిందెవరు తదితర వివరాలు తెలుసుకుని వర్మ విచారణలో వెల్లడించిన విషయాలతో సరిపోల్చుకోనున్నారు సిసిఎస్ అధికారులు. ఇక వారం రోజులుగా ఎఫ్ఎస్ఎల్ చుట్టూ చక్కర్లు కొట్టిన సైబర్ క్రైం పోలీసులు వర్మ ల్యాప్ ట్యాప్ వ్యవహారానికి సంబంధించిన రిపోర్ట్ ను త్వరగా ఇవ్వాలని కోరారు. రిపోర్ట్ చేతికందితే దానిని ముందుపెట్టి వర్మను విచారించాలని సంకల్పించారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నందున రిపోర్ట్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటిరోజు విచారణకు హాజరైన వర్మ పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో రెండోరోజున అంటే శుక్రవారం మరోసారి హాజరు కానున్న నేపధ్యంలో ఆయా ప్రశ్నలకు సమాధానం దొరుకుందని భావిస్తున్నారు. వర్మను అరెస్టు చేయాలా, లేక విచారించాలా అన్న విషయంపై న్యాయనిపుణులతో సైబర్ క్రైం పోలీసులు అనేకసార్లు భేటీ అయ్యారు. వర్మను అరెస్టు చేసి హడావిడి చేసేకంటే ఈ కేసులో ఆయనను పలుమార్లు విచారించిన తరువాత కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయాలన్న ఆలోచనలో పడ్డారు. ఆ తరువాత కోర్టు అనుమతితో తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే దేవీ ఇచ్చిన ఫిర్యాదుతో వర్మపై ఐటీ యాక్ట్ 67, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసిన పోలీసులు ఆయనని వెంటనే అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో రెండోరోజు విచారణకు హాజరు అయ్యే వర్మ కేసులో ఎలాంటి ట్విస్ట్ ఎదురౌతుందో వేచి చూడాల్సిందే.

e-max.it: your social media marketing partner

కేసిఆర్ మూటా ముళ్ళు స‌ర్ధుకోవ‌టం ఖాయం

డిసెంబర్ 11న రానున్న తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మూటా ముళ్ళు స‌ర్ధుకోవ‌టం తప్పదని...

కేంద్ర మంత్రిపై దాడి...

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలేపై ఓ దుండగుడు దాడి చేశాడు. మంత్రి వేదికపై మాట్లాడిన అనంతరం కిందికి వచ్చిన వెంటన...

చంద్రబాబుకు ఏపీ ఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు అశోక్ కుమార్ వార్నింగ్

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కార్ చొరవ చూపకపోతే ఆందోళనలే సమాధానం అవుతుందని హెచ్చరించారు ఏప...

వైఎస్ హయాంలో వంశధార ఎలా పూర్తయింది ?

వంశధార నిర్మాణ పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే

శ్రీ ముక్తేశ్వ‌ర కాళేశ్వరాలయాన్ని దర్శించుకున్న సీఎస్

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హదేవ‌పూర్ మండ‌లంలోని కాళేశ్వ‌రంలో గ‌ల శ్రీ ముక్తేశ్వ‌ర స్వామి వారిని తెలంగాణ...

కూర్మావతారంలో భద్రాచలం రాముల వారు...

భద్రాచలంలో జరుగుతున్న ముక్కోటి అధ్యయనోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు రాముల వారు కూర్మావతారంలో దర్శనమ...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ (ఐఎం) కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్...

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికై దద్దరిల్లిన ఢిల్లీ

అయోధ్యలో వీలైనంత తొందరగా రామ మందిరం నిర్మించాలంటూ హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు ఆదివారం ఢిల్లీలో నిరసన ర్యా...

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ఢిల్లీ న‌జ‌ఫ్‌గ‌ర్ ఎన్‌కౌంట‌ర్‌ లో ముగ్గురు అరెస్ట్...

దేశ రాజధాని న్యూఢిల్లీలోని న‌జ‌ఫ్‌గ‌ర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంట‌ర్‌ ఘటనలో రాష్ట్ర పోలీసులు ముగ్గురు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...