యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి ఆనందంగా పుట్టిన రోజు జరుపుకున్నారు. భార్య లక్ష్మి ప్రణతి, కొడుకు అభయ్ రామ్, అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి ఈ వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం మొదటిగా తన కొడుకు అభయ్ రామ్ తనకు విషెస్ చెప్పాడు అని చాలా సంతోషంగా ఉంది అని తన కొడుకుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు ఎన్టీఆర్. అలాగే ఎన్టీఆర్ భుజాల మీద కూర్చున్న అభయ్ నవ్వుతూ ఎన్టీఆర్ కళ్ళను మూసివేసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి నా కళ్ళను మూయటం అభయ్ కి ఎందుకు అంత ఇష్టమో తెలియదు అని సరదాగా వాఖ్యానించాడు ఎన్టీఆర్. అలాగే కళ్యాణ్ రామ్ హ్యాపీ బర్త్ డే నాన్న అంటూ ఎన్టీఆర్తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసాడు. 

జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం జై లవ కుశ. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మే 19న విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని లక్ష మందికిపైగా ట్వీట్ చేశారు. ఒక చిత్ర ఫస్ట్ లుక్ లక్షకు పైగా ట్వీట్లు సాధించటం ఒక రికార్డు. అలాగే హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అనే ట్యాగ్ ని ట్విట్టర్ లో ఇప్పటి దాకా రెండున్నర లక్షల ట్వీట్లు ట్వీట్ అయ్యాయి. గత ఏడాది జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు స్పృష్టించింది. జై లవ కుశ కోసం అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. 

జు.ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జై లవకుశ'. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, నివేద థామస్ కథానాయికలగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ శనివారం 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం 19న సాయంత్రం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. లవకుమార్ అనే బ్యాంకు ఉద్యోగి పాత్ర ఒకటి, ఇంకొకటి క్లాసికల్ డాన్సర్ గా, మూడో పాత్ర ప్రతి నాయకుడి ఛాయలు ఉంటాయని అంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం 'బేవాచ్'. మయామీలో ఈ సినిమా ప్రీమియర్‌ షోను నిర్వహించారు. ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరైంది.

ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అధినేత్రి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరిగే ఈ...

ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, రాష్ట్రపతి,...

తూర్పుగోదావరి జిల్లాలో పొలంలో రైతు దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన చుండ్రు రాఘవులు అనే రైతు దారుణ హత్యకు గురయ్యాడు....

మ‌హానాడులో ఏర్పాట్లు స‌క్రమంగా లేవంటూ తెలుగుత‌మ్ముళ్ల ఆగ్రహం

విశాఖ మ‌హానాడులో ఏర్పాట్లు స‌క్రమంగా లేవంటూ తెలుగుత‌మ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌హానాడు ప్రాంగ‌ణంలో ఏర్పా...

గోదావరిఖనిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇరువురికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దపల్లికి చెందిన షబ్బీర్ హుస్సేన్ కుటుంబం ఆసిఫా...

ఆలేరులో పాముకాటుకు బాలుడు బలి

యాదాద్రి జిల్లా ఆలేరులో దారుణం జరిగింది. స్థానిక చింతలబస్తీకి చెందిన నితిన్ అనే బాలుడు పాముకాటుకు గురవ్వగా బాల...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

మోడీ పథకాలపై షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

మూడేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దూరదర్శన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను కేంద్ర సమాచ...

పశువుల‌ వధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేష‌న్

ఆవులు స‌హా ఎద్దులు, బ‌ర్రెలు, ఒంటెలు, దూడ‌లు వంటి పశువుల‌ వధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధిం...

యాదాద్రి జిల్లాలో పరువు హత్య

యాదాద్రి జిల్లాలో పరువుకోసం హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కులం కాని వ్యక్తి తన కూతుర్ని పె...

హైదరాబాద్ లో దొంగ బాబా అరెస్ట్

అమాయకుల బలహీనతనలను ఆసరాగా చేసుకుని మంత్రాలతో కష్టాలు తీరుస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఒక దొంగబాబాన...

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

మరో సీనియర్‌ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దంపతులు బెన్‌ స్టిల్లర్‌-క్రిస్టిన్‌ టేలర్‌ తమ 1...

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో 2లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంద...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...