దర్శకరత్న దాసరి నారాయణరావు మూడు భాషల్లో అమ్మ బయోపిక్ ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమ్మ పాత్ర కోసం ఇప్పటికే ఇద్దరు మాజీ హీరోయిన్స్ తో ఆయన మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ 'శశికళ' టైటిల్ తో జయలలిత స్టోరీని తీయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో దాసరి 'అమ్మ' టైటిల్ తో జయ లైప్ స్టోరీని తెరకెక్కించబోతున్నట్లు అనౌన్స్ మెంట్ చేయడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

అనంతపురంలో ఎన్నికలు ఇప్పుడు లేవని అనుమానం ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. అవును ఇవి నిజం ఎన్నికలు కావు.

2016 లాస్ట్ లో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 విశాల్ ఒక్కడొచ్చాడు మూవీ రిలీజైంది. తమన్నా హీరోయిన్ గా నటించడంతో ఈ మూవీపై తెలుగులో కాస్త బజ్ క్రియేట్ అయింది. కానీ తీరా థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడి ఈ నల్లనయ్యా చుక్కులు చూపించాడు. అంతేకాదు ఈ మూవీను తమన్నా ఆరబోసిన అందాల ప్రదర్శన కూడా గట్టేక్కించలేకపోయింది.

2017 బిగినింగ్ లోనే ఆడియన్స్ కి  స్టార్స్ బిగ్ బొనాంజా అందించబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎడాది ప్రథమార్ధంలోనే బడా స్టార్స్ వరుసగా సినిమాలను రిలీజ్ చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. మొదటి మూడు నెలల్లోనే టాలీవుడ్ బాక్సఫీసు వద్ద వందకోట్ల బిజినేస్ జరుగబోతోంది. గత ఎడాది ప్లాప్స్ తో నిరాశపరిచిన స్టార్స్ ఈ ఎడాది సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కసిగా ఉంటే, 2016లో హిట్టు కొట్టిన స్టార్స్ మాత్రం సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి:

khaidi no150
khaidi no150

టాలీవుడ్ కి ఈ ఎడాది చాలా స్పెషల్ అనే చెప్పాలి. రాజకీయాల్లోకి వెళ్లి 9ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ ఎడాది ముఖానికి మళ్లీ రంగు పులుముకున్నాడు. తనదైన మాస్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆడియన్స్ చేత విజిల్ వేయించడానికి చిరు సిద్దమైయ్యాడు. ఆయన నటిస్తున్న రిమేక్ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సంక్రాంతి బరీలో నిలుస్తోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీతో మెగాస్టార్ మళ్లీ తన మ్యాజిక్ చూపిస్తాడా లేదా అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. ఇప్పటికే రిలీజైన మేకింగ్ ప్రోమోస్ కి వస్తున్న రెప్పాన్స్ చూస్తుంటే మాత్రం చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తెలిపోయింది. టాలీవుడ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఖైదీ నెంబర్ 150తో మెగాస్టార్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

బాలక్రిష్ణ:

shatakarni
shatakarni

సంక్రాంతి బరిలో నిలుస్తున్న మరో ప్రెస్టిజియస్ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. బాలక్రిష్ణ వందో చిత్రం కావడంతో ఈ సినిమాపై హై బజ్ క్రియేట్ అవుతోంది. దీనికి తోడు సంక్రాంతి హీరోగా బాలయ్యకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ స్టార్ గత సంక్రాంతికి డిక్టేటర్ గా వచ్చి న్యూ రికార్డ్స్ డిక్టేట్ చేయాలనుకున్నాడు. కానీ డిక్టేటర్ మాత్రం యావరేజ్ గా నిలిచింది. కానీ ఈసారి మాత్రం బాలయ్య గౌతమిపుత్రగా బాక్సపీసుని శాయిస్తాడని నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు, సాధారణ ఆడియన్స్  ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి మహావీరుడిగా నటిస్తున్న బాలకృష్ణ బాక్సపీసు వద్ద విజయభేరి మోగిస్తాడా లేదా చూడాలి.

వెంకటేష్:

guru
guru

ఈ ఎడాది ఆరంభంలోనే రాబోతున్న మరో సీనియర్ స్టార్ వెంకటేష్. గత ఎడాది 'బాబు బంగారం' గా సోసో అనిపించిన వెంకీ 'గురు' సినిమాతో మాత్రం బాక్సఫీసు గురు అనిపించుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకే తనకు అచ్చొచ్చిన రిమేక్ తో మరోసారి లక్ పరిక్షించుకుంటున్నాడు. సోలో హీరోగా సరైన సక్సెస్ కొట్టి చాలా కాలం అవుతున్న వెంకటేష్ గురు మూవీతో తప్పని సరిగా హిట్టు కొట్టి తీరాలి. మరి ఈ మూవీ అయిన వెంకీని ప్లాప్ నుంచి హిట్టు గట్టు ఎక్కిస్తోందో లేదో చూడాలి. నాగార్జున :

నాగార్జున మరోసారి భక్తిరస చిత్రంతో ప్రేక్షకులను సమ్మోహన పరుచడానికి ముస్తాబవుతున్నాడు. గత ఎడాది టాలీవుడ్ నవమన్మథుడు నాగర్జున హవా మాములుగా లేదు. 2016లో ఎడాది బ్యాక్ టూ బ్యాక్  హిట్స్ తో నాగ్ ఇండస్ట్రీని మెస్మరైజ్ చేశాడు. సోగ్గాడిగా ఓ రేంజ్ లో అలరించిన ఈ ఎవర్ గ్రీన్ రోమాంటిక్ కింగ్ 'ఊపిరి' సినిమాతో ఆల్ గ్రూప్ ఆడియన్స్ గుండెలను తాకాడు. మరి 'ఓం నమో వెంకటేశాయ' సినిమాతో నాగర్జున విజయపరంపరను కొనసాగిస్తాడా అనేది చూడాలి. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్:

katamaraidu
katamaraidu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్చిలో 'కాటమరాయుడి'గా రాబోతున్నాడు. 2016లో మోస్ట్ వాటెండ్ మూవీస్ లో ఒకటైన 'సర్ధార్ గబ్బర్ సింగ్' బోల్తా కొట్టింది. సర్ధార్ గా పవన్ మరోసారి గబ్బర్ సింగ్ లా హంగమా చేస్తాడనుకుంటే రోటీన్ గా కనిపించి నిరాశపరిచాడు. మరి కాటమరాయుడిగా పవర్ స్టార్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో మార్చిలో తెలుస్తోంది. కాటమరాయుడు పస్ట్ లుక్ చూస్తుంటే పవన్ మరోసారి కొత్తగా దర్శనమివ్వబోతున్నట్లే కనిపిస్తోంది. మరి ఈ ఎడాది పవన్ హిట్టు కొట్టి పాం అందిపుచ్చుకుంటాడో లేదో చూడాలి.

అల్లు అర్జున్:

dj
dj

సమ్మర్ లో బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్న మరో స్టార్ అల్లు అర్జున్. వరుసగా సక్సెస్ కొడుతున్న బన్నీ బడా స్టార్ గా ఎదిగాడు. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు సక్సెస్ లతో బన్నీ సక్సెస్ హవా సాగిస్తున్నాడు. పోయిన ఎడాది 'సరైనోడు' లాంటి రోటీన్ మాస్ ఎంటర్ టైనర్ తో కూడా స్టైలీష్ స్టార్ బాక్సపీసు వద్ద కనకవర్షం కురిపించాడు. ఈ మూవీ సక్సెస్ తో స్టార్ గా బన్నీ ఇమేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ స్టార్ హరీశ్ శంకర్ డైరెక్షన్ లో 'దువ్వాడ జగన్నాథమ్' మూవీ చేస్తున్నాడు. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కూడా మార్చిలోనే రిలీజ్ కాబోతుంది. మరి డిజేగా బన్నీ సక్సెస్ జోరుని కొనసాగిస్తాడా అనేది చూడాలి.

మహేష్ బాబు:

sambhavami
sambhavami

ఈ ఎడాది రాబోతున్న మోస్ట్ క్రేజీ మూవీస్ లో మురుగదాస్, మహేష్ బాబు మూవీ 'సంభవామి' ఒకటి. ఈ ఎక్సలెంట్ కాంబినేషన్ లో రానున్న మూవీ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 'శ్రీమంతుడు' తో భారీ హిట్టు కొట్టి నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకున్నాడకున్ప ప్రిన్స్ బ్రహ్మోత్సవం డిజాస్టర్ తో మళ్లీ యథాస్థానానికి చేరుకున్నాడు. కెరీర్ పరంగా బ్రహ్మోత్సవం ప్రిన్స్ పీడకల లాంటిదే. మరి ఈ పీడకలను మరిచిపోయేలా మహేష్ బాబు మురుగదాస్ మూవీతో సక్సెస్ సాధిస్తాడో లేదో చూడాలి.  

కేడర్ కు తెలంగాణ టిడిపి నేతల పిలుపు

టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రౌండ్ లెవల్ నుంచి కేడర్ సిద్దంగా ఉండాలని తెలంగాణ టిడిపి నేతలు...

రైతుల నమ్మకాన్ని వైసీపీ పోగొట్టాలని చూస్తోంది: జూపూడి ప్రభాకర్

ముఖ్యమంత్రి మీద నమ్మకంతో 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని వైసీపీ వమ్ము చెయ్యాలని చూస్తుందని టీడీపీ...

పవన్ కల్యాణ్ ట్విట్టర్ ప్రకటనపై స్పందించిన చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ప్రకటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీసారు. పోలవరం పనులు నిర్వహిస్తున్న ట్ర...

ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా మారబోతున్న ఎన్టీఆర్‌ మ్యూజియం

అమరావతిలో నిర్మించబోయే ఎన్టీఆర్‌ మ్యూజియాన్ని ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా నిర్మించబోతున్నామని నారా లోకేష్‌ దంపతుల...

ప్రారంభమయిన 'జియో స్పేషియల్ వరల్డ్ ఫోరమ్'...

హెచ్చ్ ఐసీసీ లో మూడు రోజుల 'జియో స్పేషియల్ వరల్డ్ ఫోరమ్'ను ప్రారంభించారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. కేంద్ర మ...

భక్తరామదాసు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి తుమ్మల

భక్తరామదాసు ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన పది నెలలకే పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం కావడం సంతోషంగా ఉన్నదని,...

ఇండియన్ రెస్టారెంట్ మీల్స్ తిని మరణించిన బ్రిటన్ యువతి

లండన్ లోని లాంకషైర్ లో ఉన్న రాయల్ స్పైస్ అనే ఇండియన్ రెస్టారెంట్ లో 'టేక్ అవే' మీల్స్ తిన్న మెగాల్ లీ అనే 15 ఏ...

బాంబు పేలుళ్లతో దద్ధరిల్లిన కాబూల్

ఆఫ్ఘనిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. కాబూల్ లో ఆఫ్ఘన్ పార్లమెంట్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 3...

పిబ్రవరి 7న దేశవ్యాప్తంగా ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె

డిమాండ్ల సాధన కోసం పిబ్రవరి ఏడున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసిఏషన్ ప్రకట...

జల్లికట్టుకు మద్దతుగా నిరాహార దీక్ష

జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలో డీఎంకే నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలి...

కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు చిన్నారుల ఆత్మహత్య

హైదరాబాద్ లో కుటుంబ కలహాలకు తోడు ఆర్ధిక ఇబ్బందుల కారణంతో తల్లి ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. మల్కాజ...

నరేంద్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు...

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో నరేంద్ర అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్ప...

హిస్టారికల్ సక్సెస్‌తో బాక్సాఫీస్ రికార్డు సృష్టించిన దంగల్

బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ నటించిన దంగల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. హర్యాన్వీ రెజ్లర్, మహవీర్...

రయీస్ మూవీ ప్రమోట్ ప్లాన్

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ రయీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో రయీస్...

ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్ లో సానియా-బార్బరా జోడి

ఆస్ట్రేలియా ఓపెన్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా మూడో రౌండ్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్ విభాగంల...

హైకోర్టును ఆశ్రయించిన అజారుద్దీన్

తన నామినేషన్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించాడు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియ...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...