బాహుబలి-2 చిత్రం కోసం ప్రేక్షకులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అందరి కంటే ముందే చూసేసి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూసారు. బెంగళూరులోని పీవీఆర్ ఎరేనా మాల్ లో బాహుబలి-2 ప్రీమియర్ సందర్భంగా ఘోర తప్పిదం జరిగింది. ముందుగా రెండో అర్ధ భాగాన్ని ప్రదర్శించింది థియేటర్ యాజమాన్యం. ఈ విషయాన్నీ క్లైమాక్స్ వచ్చేదాకా ప్రేక్షకులు కూడా గుర్తించకపోవటం గమనార్హం.

దర్శక దిగ్గజం, బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రతి సినిమాలో ఏదో ఒక సన్నివేశంలో దేవుడికి సంబంధించిన సన్నివేశం ఉంటుంది. కానీ వాస్తవానికి రాజమౌళి దేవుడినే నమ్మడు.

Bahubali-2
Bahubali-2

సమర్పణ: కె.రాఘవేంద్రరావు

నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌

టైటిల్: 'బాహుబలి-2':ది కంక్లూజన్

తారాగణం: ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా, నాజర్

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు

సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్‌

కథ: వి.విజయేంద్రప్రసాద్‌

నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని

దర్శకత్వం : ఎస్ ఎస్ రాజమౌళి

ఏడాదిన్నరగా యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా 'బాహుబలి-2'. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'బాహుబలి' తొలిభాగం సంచలన విజయం సాధించింది. కేవలం పాత్రల పరిచయాల కోసమే కేటాయించిన తొలి భాగం భారీ విజయం సాధించటంతో 'బాహుబలి-2'పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న ఈ రెండేళ్లు అందరి మదిలో మెదులుతూనే ఉంది. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? 'బాహుబలి-2' ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది? ఇవన్నీ తెలియాలంటే ‘కన్‌క్లూజన్‌’ చూడాల్సిందే.

కథ:

'బాహుబలి-ది బిగినింగ్‌'కు కొనసాగింపుగా బాహుబలి- 2 మొదలవుతుంది. కాళకేయుల యుద్ధంలో గెలిచిన తర్వాత అమరేంద్ర బాహుబలిని రాజమాత శివగామి మహారాజుగా ప్రకటిస్తుంది. అది భళ్ళాళదేవుడుకి, బిజ్జలదేవుడుకి నచ్చదు. ఎలాగైనా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఆలోచనలు చేస్తుంటారు. ఇదిలా ఉండగా... పట్టాభిషేకానికి సమయం ఉండటంతో దేశ పర్యటనకు బయలుదేరతాడు బాహుబలి. చిన్న రాజ్యమైన కుంతలకు చేరుకున్న బాహుబలి ఆ దేశ యువరాణి దేవసేన(అనుష్క)ను తొలిసారి చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను పొందటానికి కట్టప్పతో కలిసి అక్కడే ఉంటాడు. కుంతల రాజ్యానికి అనుకోకుండా వచ్చిన  ప్రమాదం నుంచి ఆ రాజ్యాన్ని కాపాడతాడు. 

మరోవైపు... దేవసేన చిత్రపటాన్ని చూసిన భళ్లాలదేవుడు(రానా) ఆమెపై మనసు పడతాడు. కొడుకు కోరిక మేరకు శివగామి, దేవసేనను తన కొడలిగా చేసుకోవాలని అనుకుని వర్తమానం పంపుతుంది. ఇష్టంలేని దేవసేన, శివగామి పంపిన వర్తమానం, బహుమతులను తిప్పిపంపుతుంది. భల్లాలదేవుడు ఆమెను సొంతం చేసుకోవడానికి వేసిన ఎత్తుతో అనుకోని పరిస్థితులలో దేవసేన మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది. అప్పుడేం జరిగింది? రాజ్యాన్ని విడిచి బాహుబలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? మహేంద్ర బాహుబలి భళ్లాలదేవుడిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే మిగిలిన కథ.

Bahubali-2
Bahubali-2

బలాలు:

* కథనం

* ఎమోషనల్‌ డ్రామా

* బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

* సినిమాటోగ్రఫీ

* విఎఫెక్స్‌

బలహీనతలు:

* సంగీతం

* సినిమా నిడివి

తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి పేరు మారుమ్రోగుతోంది. నూటికి 90 శాతం థియేటర్లలో ఈ సినిమానే ఆడుతోంది. బాహుబలి అభిమానులు టిక్కెట్ల కోసం థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ప్రధాని విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు

ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను ధ్వంస...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఆ...

విజ‌య‌వాడ‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వయ క‌మీటి స‌మావేశం

కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వయ క‌మీటి స‌మావేశం విజ‌య‌వాడ‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కేంద్ర మాజీ...

డ్రగ్స్ వాడకంపై ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

ఏపీ డీజీపీ సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తున్న డ్రగ్స్ వాడకంపై ఆయన స్పంది...

మహబూబ్ నగర్ జిల్లాలో ఇంజన్ ఆయిల్ కల్తి మూఠా అరెస్ట్

మహబూబ్ నగర్ జిల్లాలో కల్తిలకు పాల్పడుతున్న వ్యాపారుస్థుల పైన పోలిస్ శాఖ మరియు టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతుంద...

వరంగల్ లో సమంత సందడి

ప్రముఖ సినీనటి సమంత వరంగల్ లో సందడి చేశారు. ఓ షాప్ ఓపెనింగ్ కోసం వచ్చిన సమంతను చూసేందుకు అభిమానులు పోటి పడ్డార...

అమెరికాలో తెలుగు దంపతులు మృతి

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో గత శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియానాకు చెందిన తెలుగు దంపతులు ప్రయాణిస్...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

తల్లి, భార్యలతో కంటతడి పెట్టించిన ముకేష్ అంబానీ

తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీలతో కంటతడి పెట్టించారు ముకేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ వార్షిక సర్వ...

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..

పశ్చిమ బెంగాల్‌, ఒడిషాను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈ...

వ‌రంగ‌ల్ గాంధీన‌గ‌ర్ లో బాలుని హ‌త్య

టీఆర్ఎస్ కార్పోరేటర్ అనిశెట్టి ముర‌ళి హ‌త్య మ‌రువ‌క ముందే వ‌రంగ‌ల్ గాంధీన‌గ‌ర్ లో మ‌రో బాలుని హ‌త్య వెలుగు చూస...

సినీ ప్రముఖులను విచారించేందుకు సిద్ధమైన సిట్ అధికారుల బృందం

డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ ప్రముఖులను విచారించేందుకు సిట్ అధికారుల బృందం సిద్ధమైంది. సినీ ప్రముఖుల విచారణలో...

ఎక్సైజ్ శాఖ ను టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

ఎక్సైజ్ శాఖ ను టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద ఫిలిమ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈసారి ఎక్సైజ్ శాఖ ను టార్గెట్ చేశారు. ఈ శాఖ గురించి ఇప్పటివరకు ఎవ...

విజయ్ సరసన నటించనున్న రకుల్

విజయ్ సరసన నటించనున్న రకుల్

అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ గ్రాఫ్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. తెలుగులో అగ్రహీరోలతో వరుస సినిమాలు చేసేస...

అభిమానిపై ఆప్యాయత చూపిన సచిన్ టెండూల్కర్

తనకోసం ఎదురుచూస్తున్న అభిమానిపై ఆప్యాయత చాటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన అభిమానిని భద్రతా సిబ్బంద...

2019 వరల్డ్ కప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో విఫలమైనప్పటికీ ఓవరాల్ గా ఇండియన్ టీం ప్రదర్శన బాగుందని భారత క్రికెట్ సెలక్షన్స్ కమి...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...

లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ మానెటరీ పాలసీతో బుల్ రన్ పుంజుకుంది. సెన్సెక్స్...