హీరోయిన్లపై లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. బుధవారం నటి అమలాపాల్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యాపారవేత్తను చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చిత్రం: ఛలో 

నటీనటులు: నాగశౌర్య, రష్మిక మందాన, నరేష్‌, వెన్నెల కిషోర్‌, సత్య, పోసాని కృష్ణమురళి తదితరులు 

దర్శకత్వం: వెంకీ కుడుముల 

నిర్మాత: ఉషా ముల్పూరి 

సంగీతం: మహతి స్వర సాగర్‌ 

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌ 

ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు 

బ్యానర్‌: ఐరా క్రియేషన్స్‌ 

విడుదల తేదీ: 02-02-2018

యువ కథానాయకుడు నాగశౌర్య ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘కల్యాణ వైభోగమే’, ‘ఒక మనసు’, ‘జ్యో అచ్యుతానంద’, ‘కథలో రాజకుమారి’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనా, విభిన్న కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దాదాపు ఏడాది విరామం తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘ఛలో’ చిత్రంతో అభిమానుల ముందుకొచ్చాడు నాగశౌర్య. దర్శకుడితో కలిసి ఈ చిత్ర కథకు మెరుగులు దిద్దడంతో పాటు, సొంత నిర్మాణ సంస్థలో దాన్ని తెరకెక్కించడం విశేషం. అంతేకాదు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవిని పిలిచి మరీ ఆశీస్సులు తీసుకున్నారు. 

కథ: హరి(నాగశౌర్య)కి చిన్నప్పటి నుంచి గొడవలంటే మహాఇష్టం. ఇద్దరు గొడవ పడుతుంటే చూసి తెగ ఆనందిస్తుంటాడు. ఎవరినైనా కొట్టాలన్నా, కొట్టించుకోవాలన్నా ఇష్టం. అతడి పోరు భరించలేక హరి తండ్రి (నరేష్‌) అతడ్ని ఆంధ్రా, తమిళనాడు బోర్డర్‌లో ఉన్న తిరుప్పురం అనే ఊరు పంపించేస్తాడు. ఆ రెండు ఊళ్లకు అస్సలు పడదు. తెలుగువాళ్లు, తమిళుల మధ్య పోరు సాగుతుంటుంది. హరి ఆ ఊరి కళాశాలలో చేరతాడు. అతను తమిళ వ్యక్తి అనుకొని తమిళ బ్యాచ్‌ అతన్ని వాళ్ల టీమ్‌లోకి చేర్చుకుంటుంది. అక్కడే కార్తీక(రష్మిక)ను చూసి ఇష్టపడతాడు. ఆమెలోనూ హరిలో ఉన్న లక్షణాలే ఉంటాయి. అయితే, కార్తీక ఓ తమిళ అమ్మాయి. ఆ అమ్మాయిని ప్రేమించాలంటే ఆ ఇంట్లో వాళ్లకు నచ్చాలి. అది జరిగే పనికాదని తెలిసి, ఆ రెండు ఊళ్లను కలపాలని అనుకుంటాడు. మరి ఆ రెండు ఊళ్లు కలిశాయా? వీళ్ల పెళ్లి జరిగిందా? ఆ ఊళ్ల వెనుక ఉన్న పగ ఏంటి? అన్నదే ‘ఛలో’.

బలాలు: 

+ హీరో, హీరోయిన్‌ పాత్రలు 

+ వినోదం 

+ మాటలు, పాటలు

బలహీనతలు:

- పతాక సన్నివేశాలు 

చివరిగా: పసందైన వినోదం కోసం అందరూ చూడతగ్గ చిత్రం ‘ఛలో’.  

బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ను వదిలేస్తానంటూ హెచ్చరించి సంచలనం రేపారు. ఇటీవల ట్విట్టర్ ఫాలోవర్స్ లో షారుఖ్ ఖాన్ అమితాబ్ ను మించిపోయాడని ట్విట్టర్ ప్రకటించింది. దీంతో ఆగ్రహానికి గురైన అమితాబ్ ''ట్విట్టర్ పెద్ద జోక్ అని.. తన ఫాలోయర్ల సంఖ్యను ట్విట్టర్ తగ్గించిందని" వ్యాఖ్యానించారు. ఇలాగైతే, తాను ట్విట్టర్ ను వదిలేస్తానని హెచ్చరించారు.

నృత్య పాఠశాల యజమాని అళగేశన్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ చెన్నై మాంబలం పోలీస్‌స్టేషన్‌లో నటి అమలాపాల్‌ బుధవారం ఫిర్యాదు చేశారు.

ఢిల్లీలో క్షణక్షణం మారుతున్న రాజకీయం

ఢిల్లీలో రాజకీయం క్షణం క్షణం మారుతోంది. టీడీపీ, వేసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్‌ పార్టీ మద...

ఎన్డీఏకు గుడ్ బై చెప్పిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించని ఎన్డీయే (నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్) కూటమి నుంచి వైదొలగా...

విజయనగరంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు

స్థానిక ఆనందగజపతి కళాక్షేత్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలతో నూతన వత్సరానికి...

కాకినాడలో ఉగాది మహోత్సవం ఘనంగా నిర్వహించారు

కాలానికి తొలి అడుగు, గమనానికి దిక్సూచి, జీవిత ప్రయాణానికి ఆరంభం ఆ జీవితం పరమార్ధాన్ని తెలిపే పండుగ ఉగాది.

ఆదిలాబాద్ ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్ శాంతినగర్ సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. ఉగాది సందర్భం...

రోడ్డుపై రాస్తారోకో, కాంట్రాక్టర్ అరెస్ట్ కోసం డిమాండ్

నల్గొండ జిల్లా దేవరకొండలోని గుడితండా వద్ద జరిగిన చిన్నారుల మృతి ఘటనకు సంబంధించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని...

పుతిన్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలు లాంఛనం

పుతిన్‌ నాలుగోసారి రష్యా దేశాధినేత పదవి చేపట్టబోతున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

చర్చలకు సిద్ధమని ప్రకటించడమే పెద్ద ముందడుగు: వైట్ హౌస్ అధికారి

 ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలపై వైట్ హౌస్ అధికార ప్రతినిధి రా...

పాకిస్థాన్ తన తీరు మార్చుకోవడం లేదే

భారత సైన్యం ఎన్ని సార్లు గట్టిగా బుద్ధి చెప్పినా దాయాది పాకిస్థాన్ తన తీరు మార్చుకోవడం లేదు. తాజాగా సరిహద్దుల...

లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత

పశుదాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి, ప్రస్తుతం బిర్సాముండా జైలులో శిక్షను అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్ర...

కూకట్ పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

కూకట్ పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మూసాపేటకు చెందిన సుధీర్ ఇంటర్ పరీక్షలకు హాజరవుతుండగా పట...

స్నేహితురాలు ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ యువతి అరెస్ట్

హైదరాబాద్ లో తన స్నేహితురాలు ఇంట్లో దొంగతనానికి పాల్పడి చివరకు కటకటాల పాలైంది ఓ యువతి. కృష్ణాజిల్లా గుడివాడకు...

హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీ!

హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీ!

ఆధ్యాత్మికత ద్వారా రాజకీయాల్లో మార్పు తెస్తానని ఇటీవల వ్యాఖ్యానించిన రజనీకాంత్ మరోసారి హిమాలయాలకు వెళ్లిపోయారు...

ధనుష్ మూవీ 'వడ చెన్నై' ఫస్ట్ లుక్!

ధనుష్ మూవీ 'వడ చెన్నై' ఫస్ట్ లుక్!

తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకుడు వెట్రి మారన్ దర్శకత్వంలో నటించిన చిత్రాలు 'కాకా ముట్టై', 'విసారణై'. ఈ రెండు సి...

శ్రీలంక లో టీమిండియా భద్రతపై భారత్ లో ఆందోళన

శ్రీలంక లో పర్యటిస్తున్న భారత జట్టు క్షేమంగా ఉందని బిసిసిఐ ప్రకటించింది. బౌద్ధులకు, ముస్లింలకు మధ్య జరుగుతున్న...

రికార్డుల రారాజు మన కింగ్ కోహ్లీ

కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కింగ్ అనిపించుకున్నాడు. వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ 900 పాయింట్లు సాధించిన సరికొత్త...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...