ముంబై: రూపాయి కలవర పెడుతోంది. గత కొంత కాలంగా క్షిణిస్తూ వస్తోన్న రూపాయి విలువ ఈరోజు ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం
రూ.74.40 వద్ద నడుస్తోంది. దీని ప్రభావం దేశీయంగా చమురు దిగుమతులపై భారీగా పడుతోంది. దింతో పెట్రోల్ ధరలు రూ.100 కు దగ్గరగా పరుగులు పెడుతోంది. పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు దేశీయంగా పలు వస్తువులపై డాలరు ప్రభావం తీవ్రంగా పడనుంది. ఆర్బీఐ తక్షణ చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో డాలర్ రేట్ తో రూపాయి మారకం విలువ మరింత దిగజారే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి రూపాయి విలువ మరింత క్షిణించే అవకాశం ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు అభిప్రాయబడుతున్నారు.