దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో అతిపెద్ద కుంభకోణం

చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తన ముంబై బ్రాంచులో దాదాపు రూ.11,359 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు బ్యాంకు తేల్చింది. డైమండ్‌ మెర్చంట్‌ నిరవ్‌ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు, బిజినెస్‌ పార్టనర్‌ మెహల్ చోక్సి ఈ స్కాంకు పాల్పడినట్టు బ్యాంకు ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంలో భాగంగా 10 మంది ఉద్యోగులను పీఎన్‌బీ సస్పెండ్‌ చేసినట్టు బ్యాంకింగ్‌ సెక్రటరీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. దీనిపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ సీబీఐ విచారణ చేపట్టింది. మొండి బకాయిలను గుర్తించడానికి ఈ విచారణ సహకరిస్తుందని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

తన బ్యాంకులో దాదాపు రూ.11,359 కోట్లకు పైగా విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కొంతమంది అకౌంట్‌ హోల్డర్స్‌ ప్రయోజనార్థం ముంబైలోని ఓ బ్రాంచులో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగాయని తెలిపింది. ఈ నగదును విదేశీ అకౌంట్లకు తరలించినట్టు కూడా ధృవీకరించింది. ఈ కుంభకోణం వల్ల బ్యాంకుకు ఏ మేర నష్టం వాటిల్లుతుందో పీఎన్‌బీ వెల్లడించలేదు. కాగ, ఇదే బ్యాంకుకు సంబంధించి రూ.280 కోట్ల చీటింగ్‌ కేసులో భాగంగా అత్యంత ధనికవంతుల్లో ఒకరైన సెలబ్రిటీ జువెల్లరీ నిరవ్‌ మోదీని గతవారమే సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.

ఈ వార్తల నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు బుధవారం మధ్యాహ్నం అమాంతం పడిపోయాయి. పీఎన్‌బీ ముంబయి బ్రాంచ్‌లో దాదాపు రూ.11,359 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగినట్లు వార్తలు రావడంతో ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నట్టు విశ్లేషకులు చెప్పారు. రూ.160 షేరు విలువతో బీఎస్‌ఈలో ట్రేడింగ్‌ ప్రారంభించిన పీఎన్‌బీ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 8శాతం పడిపోయింది. ప్రస్తుతం ఆ బ్యాంక్‌ షేరు విలువ రూ.150 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు షేర్లు ఈ మేర నష్టపోతుండటంతో, పీఎన్‌బీ ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే దాదాపు రూ.3వేల కోట్ల సంపదను కోల్పోయారు.

e-max.it: your social media marketing partner

జగన్‌కు క్యాష్.. క్యాస్ట్.. మాత్రమే కావాలి..

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు క్యాష్.. క్యాస్ట్.. తప్ప, మరేవీ పట్టవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వంగవీటి...

తెలంగాణ తొలి కేబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ప్రభుత్వం కొలువు తీరాక సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలిసారి

జగన్ పై మంత్రి ఆగ్రహం

మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగన్ ఏపీపై చాలా పెద్ద

నంద్యాలకు చేరిన కాంగ్రెస్ బస్సు యాత్ర...

కర్నూలు: ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి. కాంగ్రె...

తెలంగాణ బడ్జెట్ ఇదే...

హైదరాబాద్: ఈ నెల 22న కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు తెలంగాణ మంత్రి వర్గం ఆమోదం తెలి...

మేడారం చిన్న జాతర ప్రారంభం...

ములుగు: తెలంగాణలో ఘనంగా నిర్వహించే సమ్మక్క సారలమ్మ మేడారం చిన్న జాతర ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలత...

ఇండియాపై నోరు పారేసుకున్న పాక్ మంత్రి

పుల్వామా ఉగ్రదాడిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ కు చెందిన నటీనటులను కూడా...

ఉగ్రకుట్రలో ప్రధాన సూత్రధారి మునీరే...

పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 43 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతీయండి... ఇజ్రాయిల్ సలహా

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతియండంటూ ఇజ్రాయిల్ భారత్ కు చెబుతున్నట్టుగా ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద...

దేశం కంటే ప్రపంచ కప్ గొప్పది కాదు...

ఢిల్లీ: వరల్డ్ కప్ లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్ పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. దే...

జయరాం హత్యకేసులో తెరపైకి కొత్త వ్యక్తి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ చైర్మన్, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత, ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసు విచారణ తు...

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం

భాగ్య నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం మొదలైంది. సోమాజిగూడలో ఆఫ్రికన్ కు చెందిన జెనీవే ఆల్డో

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దుస్తులు ధరించే పద్ధతి..షో ల గురించి మాట్లాడి...

బాలీవుడ్ నిర్మాత కన్నుమూత

బాలీవుడ్ నిర్మాత కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్య గురువారం ఉదయం కన్నుమూశారు. ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండే...

ప్రపంచ కప్ భారత్ దే

ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన...

మిథాలీ రాజ్ సరికొత్త రికార్డ్...

ముంబై: భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీరాజ్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ 2...

లాభాల్లో స్టాక్స్

లాభాల్లో స్టాక్స్

సుమారు 9 రోజుల పాటు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమై

జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు