సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోనున్నారు. అనంతరం నేరుగా ఏపీఐఐసీ మైదానానికి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సాంకేతిక శిఖరాగ్ర సదస్సు ముగింపు సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కీలకోపన్యాసం చేయనున్నారు. రైతులను పేదరికం వూబిలోంచి బయటకు తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు 'బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్' సంస్థను నెలకొల్పిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వానికి తన సహకారం అందించనున్నారు.