తెలుగు రాష్ట్రాల్లో వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. నోట్లరద్దు సమయంలో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న తమ తనిఖీల్లో వెల్లడైందని ఐటీ అధికారులు అంటున్నారు.
దీంతో సుమారు 40 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు సుమారు 50 వరకు డొల్ల కంపెనీలను రియల్ ఎస్టేట్ కంపెనీలు నెలకొల్పినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా భారీగా ప్రకటనలు జారీ చేసిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీపైనా ఐటీ దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరిగేషన్ తో సహా విద్యుత్, నిర్మాణ రంగంలో కాంట్రాక్టులు చేపట్టినట్లు చెప్పే ఈ కంపెనీ బోగస్ బిల్లలు సృష్టించిందని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కంపెనీ విలువ సుమారు వెయ్యి కోట్లని అధికారుల అంచనా. పుస్తకాల్లో బోగస్ కాంట్రాక్టులు సృష్టించి భారీ ఎత్తున చెల్లింపులు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. మరో 40 మంది రిలయల్ ఎస్టేట్ వ్యాపారస్థుల లావాదేవీలను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు.