మగువలకు అత్యంత ప్రీతిపాత్రమైన నగలకు ప్రత్యామ్నాయం లేదనే చెప్పాలి. అమ్మాయిలు, మహిళలు ఇలా ఏవయసువారైనా నగలంటే ప్రాణాలిస్తారు. నగలను చూస్తే చెప్పలేని అనుభూతికి లోనైపోతారు మనవాళ్లు. అందుకే బంగారు ధర ఎంతైనా..డిమాండ్ మాత్రం ఎప్పుడూ తగ్గదు. ఎంతరేటైనా అప్పుచేసి మరీ నగలను కొనేవారికి లెక్కేలేదు. అందమైన బంగారు ఆభరణాలను చూస్తే కరిగిపోని మహిళలుండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ దేశాల్లో అత్యధిక బంగారం ఉపయోగించే మొదటి దేశం మనదే. అంతేకాదు అత్యధికంగా బంగారు దిగుమతి కూడా మనమే చేసుకుంటున్నాం. వీటితో పాటు ఎగుమతి చేయడంలో కూడా మనం పోటీపడుతున్నాం.

2016-17 ఆర్థిక సంవత్సరంలో విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో మనదేశం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతులు విలువ 12.32శాతం పెరిగి 2లక్షల 89వేల 194 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎగుమతుల్లో ఎక్కవ వృద్ధి నమోదైంది. ముఖ్యంగా యూఎస్‌, హాంగ్‌ కాంగ్‌, మధ్య తూర్పు దేశాలకు ఈ ఎగుమతులు భారీగా ఉన్నాయి.  2015-16 సంవత్సరంలో మొత్తం ఎగుమతుల విలువ 2లక్షల 57వేల 463 కోట్లుగా ఉందని జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ జీజేఈపీసీ చెబుతోంది.

ఇక కత్తిరించిన, పాలిష్‌ చేసిన వజ్రాల ఎగుమతులు 12.76శాతం పెరిగి, 1లక్ష 52వేల 682 కోట్లకు చేరింది. బంగారు ఆభరణాల ఎగుమతుల విలువ 4.14శాతం పెరిగి 58వేల 464 కోట్లుగా నమోదైంది. మొత్తానికి మన ఆభరణాలకున్న ప్రత్యేక ఆకర్షణే మనకు మంచి బేరాలు తెచ్చి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే గోల్డెన్ ఛాన్స్ ఇస్తోందన్నమాట. ఈ ఎగుమతులు మరింత పెరిగితే ఇక గోల్డ్ జువెలరీతో మనదేశం గోల్డెన్ భవిష్యత్ సొంతం చేసుకోవచ్చు.

e-max.it: your social media marketing partner

ముఖ్యమంత్రి చెంతకు ఆళ్లగడ్డ టిడిపి వర్గ పోరు పంచాయితీ

ఆళ్లగడ్డ టిడిపి నేతల వర్గపోరు పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెంతకు చేరింది.

హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కడా భాజపా గెలవదు: ఎస్‌.జైపాల్‌రెడ్డి

హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కడా 2019 ఎన్నికల్లో భాజపా గెలిచే అవకాశం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీన...

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం, రాష్ట్ర విపత్తు శాఖ హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అ...

పశ్చిమగోదావరి జిల్లాలో మరోసారి భగ్గుమన్న భూవివాదం

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలులో మరోసారి భగ్గుమన్నది భూవివాదం. బినామి కౌలుదార్లు-పట్టదారుల మద్య ర...

పటాన్ చెరులో భారీ అగ్నిప్రమాదం...

సంగారెడ్డి పటాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగర్వాల్ రబ్బరు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగుతున్నాయి. ప...

మీడియా తో ముచ్చటించిన పొన్నాల లక్ష్మయ్య 

ప్రస్తుత రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.

అమెరికాతో సత్సంబంధాలను కోరుకుంటునాము: ఉత్తర కొరియా అధ్యక్షుడు

ఇకపై ఎటువంటి అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించబోమని, ఖండాంతర క్షిపణి పరీక్షలనూ నిలిపివేస్తున్నామని, అటామిక్ టెస్ట...

తుపాను దాటికి మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వాన

తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి.

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐటీ శాఖ షాక్

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల వేళ ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడైన కర్ణాటక మంత...

వెంకయ్య నిర్ణయానికి స్పందించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్

అభిశంసన తీర్మాన నోటీసును తిరస్కరించే అధికారం వెంకయ్య నాయుడికి లేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు.

యాదాద్రిలో దారుణం... దళిత యువతిపై అత్యాచారయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు...

బాలానగర్ లో అగ్ని ప్రమాదం... మంటల్లో కాలిపోయిన యువతి

ఓ యువతి ప్రమాదవుశాత్తు మంటల్లో చిక్కుకొని కాలిపోయిన సంఘటన బాలానగర్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. మూసాపేటకు చ...

టాలీవుడ్ హీరోల రహస్య భేటీలో ప్రతిపాదన...

టాలీవుడ్ హీరోల రహస్య భేటీలో ప్రతిపాదన...

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ట...

సినీ పరిశ్రమలో తాజా పరిణామాల పై చిరంజీవి ఆధ్వర్యంలో మొదలైన చర్చ

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి ఆధ్వర్యంలో 18 మంది హీరోలతో కీలక సమావేశం జరుగుతుంది,

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...