Print
Hits: 115

గుంటూరు: జగన్‌ ఎన్నికలకు ముందు ఒకటి చెప్పి ఇప్పుడు మరొకటి చేస్తున్నారని టీడీపీ నేత కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో

మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీపై బురదజల్లడమే జగన్‌ పనిగా పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో జగన్‌ ను చూస్తుంటే అతనికి అసహనం పెరిగిపోతోందని తెలుస్తోంది. సభను నడపాల్సింది స్పీకర్‌, సీఎం కాదు వెంకట్రావు ధ్వజమెత్తారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ చేస్తోన్న అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నామని, ప్రజలే బుద్ది చెబుతారని కళా వెంకట్రావు హెచ్చరించారు.

e-max.it: your social media marketing partner