Print
Hits: 78
jagan sensational decision

అమరావతి: ప్రజలు మనం మంచి చేస్తామని నమ్మకంతోనే గెలిపించారని వారి ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం

చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్. ఈరోజు ఉండవల్లిలోని ప్రజావేదికలో ఉదయం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ విధానాలపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతిని సహించేది లేదన్న జగన్, అక్రమ నిర్మాణాలను కూలదోస్తాం అని స్పష్టం చేశారు. మనం సమావేశమైన ప్రజావేదిక కూడా అక్రమ నిర్మాణమేనన్న జగన్ అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు ఇక్కడితోనే మొదలవుతాయన్నారు.

ప్రజావేదిక నిర్మాణంపై సీఎం జగన్ మాట్లాడుతూ... ‘మనం అందరం కూర్చున్న ఈ భవనం చట్టబద్ధమైన నిర్మాణమేనా? అని అధికారులను ప్రశ్నించారు. ఈ భవనం అవినీతి సొమ్ముతో కట్టింది. అక్రమంగా నిర్మించిన భవనమని తెలిసీ ఇక్కడే మనం సమావేశం పెట్టుకున్నామన్నారు. మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలియజేయడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించానన్నారు. అవినీతి ప్రక్షాళన ఈ భవనం నుంచే ప్రారంభం కావాలన్న జగన్ ఎల్లుండి నుంచే ఈ భవనం కూల్చివేత పనులు చేపడతామని తేల్చి చెప్పారు. ఇదే ఈ భవనంలో చివరి సమావేశం. రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేత పనులు ప్రజావేదిక నుంచే ప్రారంభిద్దాం.’ అని జగన్‌ అధికారులకు పిలుపునిచ్చారు.

e-max.it: your social media marketing partner