Print
Hits: 123
jagan meeting with collectors

అమరావతి: మనం పాలకులం కాదు.. ప్రజా సేవకులమని గుర్తు పెట్టుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సూచించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. నవరత్నాల

అమలే ప్రధాన అజెండాగా ఈరోజు ఉదయం ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎం జగన్ కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, నేతలతో జగన్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోన్న నవరత్నాల అమలులో ఎలాంటి భేదాభిప్రాయం చొపొద్దని... అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నవరత్నాల అందేలా చూడాలన్నారు. మనకు ఓటేయనివారికి కూడా, మన ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గ ప్రజలకు కూడా పథకాలు చేరువ కావాలని తెలిపారు. ఎన్నికలు అయ్యేవరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరూ సమానమే అన్న జగన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ మేనిఫెస్టోను పవిత్రగ్రంథంలా భావించాలని... ప్రజా పాలకులం అన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. మంత్రులు... ఎమ్మెల్యేలు మేనిఫెస్టోను దగ్గర పెట్టుకోవాలని, మేనిఫెస్టోను నమ్మి ప్రజలు ఓట్లేశారన్నది నేతలు మరచిపోవద్దని జగన్ తెలిపారు. అవినీతిరహిత పాలనే మా ప్రభుత్వ లక్ష్యం. అవినీతిని, దోపిడీని సహించేది లేదు అని జగన్ హెచ్చరించారు.

"ప్రజాస్వామ్యానికి ఎమ్మెల్యేలు, అధికారులు రెండు కళ్లలాంటి వారు అన్న జగన్ అవినీతికి పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరువకావాలి. అణగారినవర్గాలు ఆర్థికంగా బలపడేలా మన పని చేయాలి. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం బలహీనవర్గాల అభివృద్ధి కొరకే. అవినీతి, అక్రమాల కోసం, రికమండేషన్ ల కోసం ఎవరొచ్చినా తిరస్కరించాలి. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు అక్రమాలకు గానీ, దోపిడీలకు గానీ పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలకు ఆలోచించదు" అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

e-max.it: your social media marketing partner