ముఖ్యమంత్రి, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా... చిత్తూరు జిల్లా వి.కోట బస్టాండ్ దశ మాత్రం మారడం లేదు. ఈ జిల్లా నుంచి సీఎం చంద్రబాబు ,

మంత్రివర్గంలో అదే జిల్లాకి చెందిన అమర్ నాథరెడ్డి ఉన్నారు. అయినా వి.కోట బస్టాండ్ దశ దిశ మారడం లేదు. రోజూ వేలాది మంది రాకపోకలు సాగించే చోట ప్రయాణికులకు కనీస సౌకర్యాలు అందడంలేదు. మరి దాని దశ మారేదెలా? ప్రయణికుల రాత మారేదెలా? 

మంత్రి అమర్నాథరెడ్డి ప్రతినిత్యం వహిస్తున్న పలమనేరు నియోజకవర్గం, సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం మధ్యలో ఉంది వి.కోట. రోజుకు వందల్లో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. కుప్పం నుంచి చిత్తూరు, ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి, రాజధాని అమరావతి చేరుకునేందుకు వి.కోట మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న బస్టాండ్ ను ఆర్టీసీ అధికారులు వదిలేశారు. 

అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. వి.కోట మీదుగా కడప, కర్నూలు, హైదరాబాద్ వరకు రాకపోకలు సాగుతూంటాయి. అటు తమిళనాడు రాజధాని చెన్నై, ఇటు కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లేందుకు వి.కోట చెక్ పోస్ట్ లాంటిది. అందుకే ఎప్పుడు చూసినా వి.కోట బస్టాండ్ కిటకిటలాడుతూంటుంది. కానీ అధికారుల పట్టింపులేదని ప్రయాణికులు వాపోతున్నారు.

ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా లక్షల్లో ఆదాయం వస్తోంది. ప్రయాణికులకు సరైన వసతులు మాత్రం లేకుండా పోయాయి. కూర్చోవడానికి కుర్చీలు లేవు. వాష్ రూములు లేవు. బస్సు నిలపడానికి సరైన ప్లాట్ ఫారం కూడా నిర్మించలేదు. వర్షం వచ్చిందంటే బస్టాండ్ అంతా బురదమయం. బస్సులు ఎక్కడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటోంది అంటూ మరో ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పలమనేరు నియోజకవర్గం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు నియమించిన నెల్లూరు ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ బస్టాండ్ ను గతంలో సందర్శించారు. అయ్యో! ఇలా ఉందేమిటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తానే ముందుండి అభివృద్ధి చేస్తానన్నారు. కానీ మరచిపోయారు. అంటూ మరో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొసమెరుపేంటంటే ఆ పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఆ విషయం అంతటితో ముగిసిపోయింది. అందుకే ఇక సీఎంగారూ, మీరే దిక్కు అని అంటున్నారు ప్రయాణికులు.

e-max.it: your social media marketing partner

జగన్ సీఎం...నా గెలుపు ఖాయం..

ఏపీలో ఫ్యాన్ గాలి వీస్తోందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే

ముగిసిన విపక్షాల భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో గల కానిస్టిట్యూషన్

సీఎం నివాసం వద్ద భద్రత పెంపు

గురువారం ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద

శ్రద్ధ ఆస్పత్రిని సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో శ్రద్ధ ఆస్పత్రి చేసిన అక్రమాలు వెలుగులోకొచ్చాయి. కనీసం మెడికల్ కౌన్సిల్ గ...

ఎన్నికల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

తెలంగాణలో ఎన్నికల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు టీఎస్ ఎన్నికల నిర్వహణాధికారి రజత్ కుమార...

1కి.మీకు రూ.2 మాత్రమే...

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట మెట్రోస్టేషన్‌ వద్ద వాహన ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ కేంద్రం, స్మార్ట్‌ పార్కింగ్‌ సదు...

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో గల పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.32 గంటల సమయంలో

మసూద్ విషయంలో సానుకూలంగా స్పందించిన చైనా

మసూద్ అంశంపై చైనా సానుకూలంగా స్పందించింది. యూఎన్‌ సమావేశానికి ఒకరోజు ముందు

ఈవీఎంల లెక్కింపు తర్వాతే...

కేంద్ర ఎన్నికల సంఘం విపకాలకు షాక్ ఇచ్చింది. కౌెంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని ఈసీ స్పష్టం చేసింది. వీవీ...

అండమాన్ దీవులను వణికిస్తోన్న భూ కంపాలు

అండమాన్ నికోబార్ దీవులను వరుస భూ కంపాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అక్కడి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని

స్కూల్ బస్సుపైకి దూసుకెళ్లిన లారీ

హైదరాబాద్ లోని ఖాజాగూడ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన

 కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి నోటీసులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి వైద్య ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. రేపటి లోపు

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

చెన్నై: గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం అంటూ... బాధపడుతున...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

హైదరాబాద్: 50 రోజుల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే చెరో మూడు సార్లు కప్పు ఎగరేసుకు పోయిన ఆ ర...

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో భాగంగా రేపు ఉప్పల్ వేదికగా ముంబై-చెన్నై మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...