అడ్డగోలు నిర్ణయాలకు ఏపి ప్రభుత్వం కేరాప్ అడ్రస్ గా మారుతోందన్న ఆరోపణలు వినబడుతున్నాయి. పాఠశాలల్లో ఏ మార్పులు చేయాలన్నా విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాని ఏపిలో మాత్రం మంత్రి నారాయణ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి.

ఏపిలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లో కూడా తెలుగు మీడియం తొలగించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ మంత్రి నారాయణ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఉపాద్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలుగు మీడియంను కొనసాగిస్తూనే పార్లల్ గా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టవచ్చు కాని తెలుగు మీడియం తొలగించడమంటే స్కూల్స్ ను నిర్వీర్యం చేయడమేనని వారు వాపోతున్నారు. ఇంటర్ విద్యను ప్రైవేట్ పరం చేసిన ఏపి ప్రభుత్వం ఇప్పుడు పాఠశాల విద్యపై దృష్టి సారించింది. మున్సిపల్ స్కూల్స్ లో తెలుగు మీడియం తొలగించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో భాషరాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ స్కూల్స్ కు పట్టం కట్టేందుకే ఏపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ లోని మున్సిపల్‌ పాఠశాలల్లో తెలుగు మాధ్యమానికి ప్రభుత్వం మంగళం పాడింది. విద్యాశాఖతో సంబందం లేకుండా నేరుగా మున్సిపల్ శాఖామంత్రి నారాయణే అన్ని మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇంకేముంది రాత్రికి రాత్రే తెలుగు మీడియంను తొలగిస్తూ ఇంగ్లీష్ మాద్యమం పుస్తకాలు ప్రత్యక్షమయ్యాయి. అప్పటిదాకా తెలుగు మీడియం చదివిన విద్యార్థులకు హైస్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అర్దంకాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాదారణంగా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలి అంటే తెలుగు మీడియంను పార్లల్ షెక్షన్ కొనసాగిస్తూ ఆశక్తి ఉన్న విద్యార్థులకు హైస్కూల్ లెవల్ లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలి. కాని ఏపి పురపాలక శాఖమంత్రి నారాయణ మాత్రం ఇవేమీ పట్టకుండా ఏకపక్షంగా తెలుగు మీడియంను తొలగించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో అక్కడ చదివే లక్షలాదిమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భాష అర్దంకాక విద్యార్థులతో పాటు టీచర్లు భాద పడుతున్నారు. ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవతరగతి వరకు ఐదులక్షలమంది విద్యార్థులు చదువుతున్నారు. పురపాలక పాఠశాలల్లో 70 శాతం మంది విద్యార్థులు తెలుగు మాధ్యమంలోనే చదువులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం అర్థంకాక విద్యార్థులు మధ్యలోనే చదువుమానేస్తే తగ్గిపోయిన సంఖ్యను చూపి రేషనలైజేషన్‌ పేరిట స్కూళ్లను మూసివేసి ఆ విద్యార్థులను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే వ్యూహంతో ప్రభుత్వం, మున్సిపల్‌ శాఖ ఉన్నాయని ఉపాద్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఆంద్రప్రదేశ్ లో రెండువేల 199 మున్సిపల్ పాఠశాలలున్నాయి. వీటిలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు 5 లక్షలమందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ముందొస్తు సమాచారం లేకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో హైస్కూల్ లో చదివే విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారింది. మున్సిపల్ స్కూళ్ళ నుండి తెలుగు మాధ్యమాన్ని ఎత్తేస్తున్నట్లు విద్యాశాఖ అసలు ప్రకటించనేలేదు. ఉత్తర్వులు మాత్రం మున్సిపల్ శాఖ జారీ చేసింది. మున్సిపల్ శాఖకు మంత్రి నారాయణ ఒక బాద్యతా యుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలా కార్పొరేట్ వ్యాపారం చేయడం ఏంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంగ్లీష్ మీడిమం అర్దంకాక విద్యార్థులు సంఖ్య తగ్గిపోతే మున్సిపల్ స్కూళ్ళను మెల్లిగా మూసేసి ఆ విద్యార్ధులందరినీ కార్పొరేట్ స్కూళ్ళకు తరలించాలన్న కుట్ర జరుగుతోందని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పట్టణాల్లో విస్తరించిన కార్పొరేట్ స్కూల్స్ వ్యాపారం మున్సిపాలిటీలకు విస్తరించేందుకే మంత్రి నారాయణ కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

 

 

e-max.it: your social media marketing partner

సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు

మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని మండలంలోని సర్పంచులు బహిష్కరి...

కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జిహెచ్ఏంసి ముట్టడికి ప్రయత్నం చేశారు. వారిని ఎమ్మెల్యే క్వార్...

మునిగిన పోలవరం డయాఫ్రం వాల్

గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెస్ట్ గోదావరి జిల్లా పోలవరం డ్యామ్ వద్ద గోదావరి పరవళ్ళు త...

టీటీడీకి చంద్రబాబు ఆదేశాలు

తిరుమలలో మహాసంప్రోక్షణపై టీటీడీ పాలక మండలి తీసుకున్న శ్రీవారి దర్శనం నిలిపివేత నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆద...

పాల‌మూరు జిల్లాలో డ‌బ‌ల్ బెడ్రూం ఇండ్లపై స‌మీక్ష

బుధవారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అనితా రామ‌చంద్రన్ ప‌ర్యటి...

శాకంబరీ నవరాత్రి వేడుకలు

వరంగల్ మహా నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి వేడుకలు నాల్గువ రోజు...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

కురియన్ కు గౌరవ వీడ్కోలు

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జే.కురియన్ పదవీకాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు నివాసంలో ఆదివ...

మహబూబాబాద్ జిల్లాలో ఉక్కు బంద్

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ అఖిల పక్షాలు మహబూబాబాద్ జిల్లాలో బుధవారం బందుకు పిలుపునిచ్చాయి. బంద్...

స్కూల్ వ్యాన్ లో మంటలు

నిర్మల్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్, స్థానికులు చిన్నా...

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

హైదరాబాద్‌: తెలుగు సీనియర్‌ సినీ నటుడు వినోద్‌ (59) కన్నుమూశారు. బ్రెయిన్‌స్ర్టోక్‌తో శనివారం తెల్లవారుజామున 2...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్

భారతదేశంలో వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్ ను ప్రవేశపేట్టిందని బీఎస్ఎన్ఎల్ పీజీఎమ్ నరేందర్ తెలిపారు. వింగ్స్ య...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...