పశ్చిమగోదావరిజిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాం కారణంగా జనజీవనానికి ఇబ్బంది కలుగుతోంది. శనివారం తెల్లవారు జాము నుంచి కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఎపి సిఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి మృతి చెందాడు.గుడుపల్లి మండలం నరసన పల్లికి చెందిన సునీత కుప్పం ప్రభుత్వాసుపత్రిలో రెండురోజుల క్రింత బిడ్డకు జన్మనిచ్చింది.అయితే ఈ వేకువ జామున బిడ్డకు జ్వరం ఎక్కువగా రావడంతో ఆందోళన చెందిన తల్లి నర్సులకు సమాచారమిచ్చింది.అయినా నర్సులు, డాక్టర్లు పట్టించుకోకపోవడంతో బిడ్డ మృతి చెందాడు.దీంతో కలత చెందిన తల్లి సునీత కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.రాత్రి వేళలల్లో ప్రభుత్వ వైద్యులు హాస్పిటల్ లో ఉండకపోవడంతో ఇలాంటి ఘటనలూ తరుచూ చోటు చేసుకుంటున్నాయి అని  కలెక్టర్ అన్నారు.దీని ఫై చర్య తీసుకుంటాం అని కలెక్టర్ అన్నారు.

 రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన ఘటన విజయవాడలో జరిగింది.బాధితుల నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసి స్థలాలు రిజిస్ర్టేషన్ లు చేయకుండా ఎగనామం పెట్టి నిందితుడు పారిపోయాడు.తణుకు పట్టణానికి చెందిన పసుపులేటి రవితేజ రియల్ ఎస్టేట్ పేరుతో సుమారు 100కోట్లకు మోసం చేసినట్లు ఆరోపిస్తున్నారు.విజయవాడ, కృష్ణాజిల్లా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో స్థలాలు విక్రయిస్తామని చెప్పి ప్రజల వద్ద నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు.విజయవాడ సమీపంలోని అజయ్ కుమార్ ఘోష్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరడంతో విషయం వెలుగులోకి వచ్చింది.బాధితుడికి కానూరు గ్రామంలో 2007వ సంవత్సరంలో 217గజాలకు రూ. 3,50,000, 200గజాలకు 2,00,000లు తీసుకుని స్థలాలు రిజిస్ర్టేషన్ చేయకుండా ఎగనామం పెట్టారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు  చేయడంతో నిందితులు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పోలీసులకు ఫోన్ చేయించినట్లు నిందితుడి కుమారుడు సందీప్ చెప్పడం విశేషం.అదే విధంగా సందీప్ కూడా బాధితులను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడడంతో అతనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.పెనమలూరు పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నడిచింది.సుమారు 100కోట్ల మేర ప్రజలకు టోకరా పెట్టిన నిందితుడిని మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు.ఏ కేసులో అరెస్టు చేశారో కూడా చెప్పకుండా పోలీసులు జాగ్రత్త వహించారు..నిందితుడిని కారులో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అతనికి హై బీపీ ఉండడంతో వార్డులో చికిత్స ఇస్తున్నారు.అయితే తండ్రిని  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కుమారుడు సందీప్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.ఈ కేసులో నిందితుడిని జైలుకు తరలించకుండా బెయిల్ వచ్చే విధంగా పోలీసులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.నిందితుడిపై పెనమలూరు, మాచవరం, పామర్రు పోలీసు స్టేషన్ లలో కేసులు ఉన్నట్లు తెలుస్తొంది. 

తిరుమల శ్రీవారి ఆలయం చెంత గురువారం ప్రయోగాత్మకంగా ప్రహరీ ఉద్యానవనాలను ప్రారంభించారు టిటిడి అధికారులు.తొలివిడతలో ఆలయ మహద్వారానికి ఇరువైపులా 2500 కుండీల్లో ఫోలియేట్‌ జాతి మొక్కలతో పాటు క్రోటాన్లను కూడా పెంచుతున్నారు.ఈ మొక్కలకు ఆటోమేటిక్‌ డ్రిప్‌ విధానం ద్వారా నీటిని అందేలా ఏర్పాట్లు చేసారు.రెండో విడతలో వైభవోత్సవ మండపం, సహస్రదీపాలంకార సేవ మండపం వద్ద కూడా ఈ ఉద్యానవనాలను ఏర్పాటుచేయనున్నారు.కాగా,ఈ ప్రహరీ ఉద్యానవనాలను హైదరాబాద్‌కు చెందిన హర్ష బయోఫామ్‌ సంస్థ ఒక సంవత్సరం పాటు నిర్వహించనుంది.ఇందుకు రూ.30 లక్షల వ్యయం కానుంది.ఈ మొత్తాన్ని హర్ష బయోఫామ్‌ సంస్థ ఉచితంగా భరించనుంది.అంతేగాక సంస్థ ప్రతినిధులు తితిదే ఉద్యానవన సిబ్బందికి ప్రహరీ ఉద్యానవనాల పెంపకంపై శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

ఏపీఏఐసీసీ ఇన్‌చార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి

ఏపీఏఐసీసీ ఇన్‌చార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

వ్యవసాయాన్ని పండగలా మార్చింది మేమె

తెలంగాణాలో ప్రజలంతా 24 గంటల కరెంటు పొందుతున్నారని అదంతా కేసీఆర్ కృషి, ఘనతేనని తెలంగాణ ఎంపీ కవిత అన్నారు. తెలంగ...

నిండు ప్రాణం నీటి పాలు

ఇసుక పడవ చేపల వేటకు వెళ్లిన పడవను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుంటూరు జిల్లా తుళ్లూరు

రమణ దీక్షితులపై సిబిఐ విచారణ

టీటీడీ ఆభరణాల మాయంపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై మాజీ పురావస్తు శాఖాధికారి చెన్నారెడ్డి సంచలన

కొత్త జోనల్‌ విధానానికి తెలంగాణ మంత్రి వర్గం ఆమోదం

తెలంగాణలో కొత్త జోనల్‌ విధానానికి తెలంగాణ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆ...

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షురూ

ఇంటర్ విద్యానంతరం ఇంజినీరింగ్ ఉన్నత చదువులకు గాను జరిగే కౌన్సిలింగ్ ప్రక్రియను తెలంగాణలో అధికారులు మే25న ప్రార...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

ఢిల్లీ-మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వే షురూ

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఢిల్లీ-మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వే తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభ...

నిఫా వైరస్ భారత్ లో కొత్తకాదు

నిఫా వైరస్ మనదేశంలో ఇది వెలుగు లోకి రావడం కొత్తకాదు. కానీ వేగంగా, సమర్ధంగా చర్యలు తీసుకోకపోతే ఈ అంటువ్యాధి కోర...

పార్థీ గ్యాంగ్, చెడ్డీగ్యాంగ్ లనేఅనుమానంతో అమాయకులపై దాడులు

గత వారం 10రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్థీ గ్యాంగ్, చెడ్డీగ్యాంగ్ లతో పాటు నరహంతక ముఠాలు తిరిగుతున్నాయ...

తమిళనాడులో ప్రజా సంఘాల ఆందోళన

స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసేయాలంటూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడంతో తమిళనాడులోని

ఎన్టీఆర్ దృశ్యకావ్యం హీరో ఆయనే...

ఎన్టీఆర్ దృశ్యకావ్యం హీరో ఆయనే...

నట సార్వభౌముడు, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ‘ఎన్టీఆర్‌’ ఖరారయ్యింది. బాలకృష్ణ టైటిల్‌ రోల్...

మాదాల రంగారావు (రెడ్‌స్టార్‌) అస్తమయం

మాదాల రంగారావు (రెడ్‌స్టార్‌) అస్తమయం

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు మాదాల రంగారావు(69) అనారోగ్యంతో కన్నుమూశారు. గత

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...