తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 8వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 'కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం' కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు టిటిడి అధికారులు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ శుద్ధి నిర్వహించి అనంతరం సర్వ దర్శనానికి భక్తులను అనుమతించారు. ఈ సందర్భంగా ప్రతి మంగళవారం నాడు నిర్వహించే అష్టాదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి ఉ.11.00 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ తిరుమంజన ఉత్సవాన్ని పురస్కరించుకొని టిటిడి అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసింది. ముందుగా స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేసి, ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, టిటిడి సభ్యులు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...